సిగరేట్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ స్వయంగా సిగరెట్ ప్యాకెట్లపైనే రాసి వున్నా దాని అమ్మకాలకు కోదవలేదు.. తాగే వాళ్లకు కొదువలేదు. ఇది చాలదన్నట్లు అటు దూమపానం చేయడం వల్ల తాగిన వారితో పాటు వారి చుట్టూ వున్నవారి అరోగ్యానికి కూడా హాని కలుగుతుందని అటు ప్రభుత్వాలు, ఇటు వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు. ఇది చాలదన్నట్లు ఏ సినిమాకు వెళ్లిన తాటికాయంత అక్షరాలతో ప్రచారం.. ఇక సినిమాలో ఎదైనా సన్నివేశం డిమాండ్ చేసి.. అందులో నటుడు సిగరేట్ తాగినా.. వెంటనే వెండితెరపై సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటూ కింద ప్రకటన వేస్తుంటారు.
ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన చట్టంతో మన రాష్ట్రంలోనూ బహిరంగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం నేరం.. ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధిస్తునే వున్నారు. మనదేశంలోనే కాదు అనేక దేశాల్లో బహిరంగ దూమపానం చేసిన వారిపై అక్కడి అధికారులు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమాన కూడా విధిస్తారు. ఇక ఈ చట్టం అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఏకంగా దశాబ్దాల కాలం నాటి నుంచి ఆచరణలో వుంది. అయితేనేం అంటూ కొంతమంది మాత్రం ఈ చట్టాన్ని ఉల్లంఘించడానికే సిద్దపడుతున్నారు.
తాజాగా ఓ యువతి ఇలా బహిరంగ దూమపానం చేయడంతో ఏకంగా విమానాన్నే నిలిపేసింది. అదేంటి.. అంటారా.. ఆ యువతి సిగరేట్ తాగింది విమానంలోనే. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో గత మంగళవారం చోటు చేసుకుంది. విమానంలో ఉన్న తోటి ప్రయాణీకుడు దీనిని వీడియో తీసి టిక్ టాక్ లో పోస్టు చేయగా..ఇది కాస్తా వైరల్ గా మారింది. ఇది సరే మరి విమానాన్ని ఎలా నిలిపేసింది అంటారా.?
అక్కడికే వస్తున్నాం.. ఫోర్ట్ లాడర్ వేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్పిరిట్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అయ్యిందుకు రన్ వే పై పరుగులు పెడుతోంది. అదే సమయంలో విమానంలో ఉన్న ఓ యువతి సిగరేట్ తాగడం ప్రారంభించింది. దీంతో తోటి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆ యువతి ప్రవర్తనకు నోచ్చుకున్న ఓ వ్యక్తి వెంటనే ఆ సన్నివేశాన్ని రికార్డు చేసి.. విమాన సెక్యూర్టీ సిబ్బందికి వీడియోను చేరవేశాడు. అంతే సమాచారం అందుకోవడంతో వారు రంగంలోకి దిగి వెంటనే విమానాన్ని నిలిపివేశారు. ఆ యువతిని కిందకు దిగిపోవాల్సిందిగా హెచ్చరించారు. యూఎస్ లో 1988లో బహరింగ ప్రదేశాల్లో సిగరేట్ తాగడం నిషేధమనే సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
May 19 | పెళ్ళంటె పందిళ్ళు.. సందళ్ళు, తప్పెట్లు.. తాళాలు తలంబ్రాలూ, మూడే ముళ్ళు.. ఏడే అడుగులు.. మొత్తం కలిసీ నూరేళ్ళు అంటూ ఎవర్వైనా తమ పెళ్లి అనగానే ఆ రోజున ఎంతో ఆనందంగా ఉంటూ.. అహ్లాదకరంగా గడపుతారు.... Read more
May 19 | ప్రేమ అనేది రెండు అక్షరాలే అయినా ఎప్పుడు ఎవరి మీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఇక ప్రేమ కలిగిన తర్వాత అబ్బాయి, తన ప్రేమను అమ్మాయికి తెలుపడానికి నానా తిప్పలు పడుతుంటాడు. ఎలా తనలో... Read more
May 19 | పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు జైలు శిక్షను విధించింది. ఏడాది పాటు జైలు శిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. 1988లో రోడ్డుపై గొడవ పడిన... Read more
May 19 | మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో హిందువులపై అదనపు పన్నులు వేసిన ఇబ్బందులకు గురిచేశాడన్న విషయం చరిత్ర పాఠ్యపుస్తాకాల్లో నిక్షిప్తమైవుంది. ఈ అంశమే ఇప్పుడు మహారాష్ట్రలో ప్రజల మధ్య శాంతియుత వాతావరణానికి భంగం కలిగిస్తోంది. ఇటీవల... Read more
May 19 | ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లోని ఏఈసీ పాఠశాలలో ఉపాధ్యాయ ఆశావహులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని... Read more