Farmer Draws Heart from Sheep as Tribute to Aunt మేనత్తకు ‘‘హృదయపూర్వక నివాళి’’.. నెట్టింట వీడియో వైరల్..

Australian farmer pays tribute to beloved aunt with heart shaped sheep

heart shape sheep, aussie farmer heart sheep, farmer heart shape sheep tribute, australian farmer sheep tribute, australia sheep heart, australia sheep, bridge of troubled water, Aunt, farmer, Ben Jackson, Guyra, Brisbane, border closures, corona pandemic, Sheep, Heart shape, drone, Australia

Ben Jackson from Guyra, was unable to travel to his aunt's funeral in Brisbane due to border closures amid corona pandemic. So instead he created an enormous heart-shaped formation of sheep on his property. Using some grain and lots of sheep, the Australian farmer managed to create a heart shape and flew a drone overhead to capture the moment.

ITEMVIDEOS: మేనత్తకు ‘‘హృదయపూర్వక నివాళి’’.. నెట్టింట వైరల్.. రైతు ఐడియా

Posted: 08/27/2021 04:11 PM IST
Australian farmer pays tribute to beloved aunt with heart shaped sheep

మనస్సు అంటూ ఉండాలేకానీ.. మార్గాలు అనేకం అన్నట్లు.. ఎంతటి కరోనా మహమ్మారి విజృంభించినా.. తన అత్తయ్యకు హృదయపూర్వక నివాళిని అర్పించాడు ఓ వ్యక్తి. మాటలకు అందని భావాలను ‘చిత్రాల్లో’ చూపటం అనేది ఓ అద్భుత ఆలోచన. అటువంటి ఓఅద్భుతాన్ని మూగ జీవాలతో ఆవిష్కరించి తన మేనత్తకు నివాళులు అందించాడు ఆ వ్యక్తి. మూగ జీవాలైన ‘గొర్రెలతో గుండె’ను నిర్మించాడు. దాంతో తన మేనత్తకు నివాళులు అర్పించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరంటే.. ఓ సాధారణమైన రైతు.

కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఎంతో మంది తమ కుటుంబ సభ్యులకు, బంధువులకు దూరంగా గడపాల్సి వచ్చింది. మరెంతో మంది తమవాళ్ల అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేకపోయారు. అటువంటి పరిస్థితే వచ్చింది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ కు చెందిన రైతు బెన్ జాక్సన్‌ కు. తన మేనత్త చనిపోయినా వెళ్లలేకపోయాడు. కడసారిగా కళ్లారా చూసుకోలేకపోయాడు. అంతిమ వీడ్కోలు చెప్పలేకపోయాడు. అందుకోసం తన అత్తకు తన ‘గొర్రెలతో గుండె’ను నిర్మించి నివాళి అర్పించాడు.

క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన డెబ్బీ బెన్ జాక్సన్ కు అత్త అవుతుంది. ఆమె గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతూ కన్నుమూశారు. బ్రిస్బేన్‌లో జరిగిన ఆమె అంత్యక్రియల్లో పాల్గొనాలంటే బెన్ జాక్సన్.. తాను ఉండే ప్రాంతం నుంచి 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలి. కానీ..కరోనా లాక్ డౌన్ వల్ల ప్రయాణాలపై ఆంక్షలు విధించడంతో వెళ్లలేకపోయాడు బెన్. దీంతో మేనత్తకు నివాళులు అర్పించాలని అనుకున్నాడు. ఒక పొలంలో హృదయం ఆకారాన్ని గీసి, ఆ ఆకారంలో తన గొర్రెలకు ఆహారం వేసి.. గొర్రెలను వదిలాడు బెన్.

అలా పలుమార్లు ప్రయత్నించిన తర్వాత గొర్రెలు అలా ఆ హార్ట్ సర్కిల్ లోకి వెళ్లాయి. అలా వెళ్లిన గొర్రె హృదయాకారం గా మారాయి. దీన్నంతా బెన్ డ్రోన్ తో షూట్ చేసి..తన ఆంటీకి ఇష్టమైన పాటను జతచేసి..సోషల్ మీడియాలో పెట్టారు. సోమవారం తన ఆంటీ అంత్యక్రియలకు ముందు ఈ వీడియోను తన బంధువులతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బెన్ మాట్లాడుతూ..”నేను మా ఆంటీ అంత్యక్రియలకు వెళ్లలేకపోయాను. దీంతో ఏం చేయాలో నాకు తెలియలేదు. అందుకే ఈ వీడియో ద్వారా ఆమెకు నివాళి అర్పించాలనుకుని ఇలా చేశాను” అని తెలిపాడు.

ఇంకా తన ఆంటీ గురించిబెన్ మాట్లాడుతూ..ఆంటీకి అందరితోను కలిసి ఉండటమంటే చాలా ఇష్టపడేవారు.ఇతరులతో తన ఆలోచనలను, భావాలను పంచుకోవటానికి ఆమె చాలా ఇష్టపడేవారు అని బెన్ జాక్సన్ తెలిపాడు. ఈ వీడియోను చూసి ఎంతో మంది సంతోషిస్తున్నారని, తన ఆంటీ కూడా పైలోకంలో ఉండి సంతోషపడుతుంటారని ఆశాభావం వ్యక్తం చేశాడు బెన్ జాన్సన్. అది చూసిన నెటిజన్లు మనసుండాలే గానీ మార్గం ఉండకపోదు అనేలా కామెంట్స్ పెట్టారు. ఈ వీడియోను ఆస్ట్రేలియా టీవీ చానెళ్లు కూడా ప్రసారం చేశాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aunt  farmer  Ben Jackson  Guyra  Brisbane  border closures  corona pandemic  Sheep  Heart shape  drone  Australia  

Other Articles