Hero Electric launches host of unique employee benefits హీరో ఎలక్ట్రిక్ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన యాజమాన్యం

Hero electric launches host of unique employee benefits

benefits to employees, electric vehicles, hero comapany, Hero Electric, honda electric vehicles, Naveen Munjal, Flexible Timings, Hero Club, Housing Loans, Vehicle loans, Education loans, scholarships, maternity leaves, hero electric staff, hero electric employees, hero electric benefits, hero electric, ex-hero club, Business news

EV two-wheeler maker Hero Electric has introduced Hero Care, a flexible benefits policy for its employees that takes care of their and their family in different stages of their careers. The programme will cover every employee who has completed a minimum of two years in the company.

హీరో ఎలక్ట్రిక్ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించిన యాజమాన్యం

Posted: 08/25/2021 04:44 PM IST
Hero electric launches host of unique employee benefits

ద్విచక్రవాహనల తయారీ సంస్థ హీరో తమ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. అయితే ఇది అన్ని ద్విచక్రవాహనాలకు కాదు సుమా.. కేవలం హీరో కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు మాత్రమే. హీరో సంస్థ ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఈ వాహనాల ఉత్పత్తి శరవేగంగా సాగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే హీరో కంపెనీ తమ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్ కల్పిస్తుంది. కంపెనీలో కనీసం రెండేళ్లు పూర్తి చేసుకున్న ప్రతి ఉద్యోగికి ప్రయోజనాలను కల్పించడానికి ఓ కార్యక్రమం ప్రవేశపెట్టింది.

అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి సమన స్థాయిలో బెనిఫిట్స్ కల్పించనుంది. రెండేళ్లు పూర్తి చేసుకున్న ఉద్యోగుల జీవిత భాగస్వాములకు కంపెనీలో ఫుల్ టైమ్/పార్ట్ టైమ్ ఉపాధిని కల్పించడం. ఉద్యోగులకు వాహన రుణాలను అందించడం, అలాగే అదనపు సెలవులు ఇవ్వడం. దీర్ఘకాలిక గృహ రుణాలను స్థిర వడ్డీకి హీరో కేర్ అందిస్తుంది. ఉద్యోగులకు ప్రసూతి సెలవుల కింద 15 రోజులు సెలవులు ఇవ్వడం, 6 నెలల వరకు నచ్చిన సమయంలో పనిచేసే అవకాశం, మొదటి 3 నెలల్లో 10 రోజుల వరకు ఇంట్లో నుంచి పనిచేయవచ్చు. 20-25 సంవత్సరాల వయస్సు ఉన్న ఉద్యోగులు పనితీరు ఆధారంగా ఉన్నత విద్యను అభ్యసించడానికి విద్యా రుణాలు, స్కాలర్ షిప్స్ ఇవ్వనుంది.

పరీక్షల సమయంలో వారికి ఫ్లెక్సీబుల్ టైమింగ్స్ కల్పించనుంది. ఇక ఈ అంశంపై హీరో ఎలక్ట్రిక్ ఎండీ నవీన్ ముంజల్ మాట్లాడుతూ.. తమ ఉద్యోగులు రెండేళ్లుగా కష్టపెడుతున్నారని.. ఈ రోజు తాము ఈ స్థాయికి చేరుకున్నామంటే ఉద్యోగుల కృషి పట్టుదలే కారణమని.. అన్నారు. తమ అభివృద్ధికి సహకరిస్తున్న ఉద్యోగులకు సంస్థ సాయం అందిస్తుందని వివరించారు. రిటైర్ అయిన ఉద్యోగులు మాజీ హీరో క్లబ్ లోచేరి తమ రెండో ఇన్నింగ్స్ కొనసాగించడానికి ఈ కార్యక్రమం సహాయపడుతుంది అని అన్నారు. రిటైర్ అయినవారు క్లబ్ లో జాయిన్ అయితే ఐదేళ్ల పాటు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles