There’s a RAT in Your Mobile ర్యాట్ తో అకౌంట్ ఖాళీ చేయిస్తున్న సైబర్ నేరగాళ్లు..

Cyber criminals choose new way of fraud via remote access tool

Bank details, cyber cheating, Cyber criminals, cyber fraud, Know Your Customer, Remote Acess Tool, State Bank of India, SBI, Cyber crime

Cyber-criminals are rushing into the mobile space, posing a significant threat to both the banking and e-commerce industries. At the forefront of this wave of attacks are Remote Access Trojans (RATs) – a traditional favorite among cyber-criminals. This form of malware has become incredibly popular among fraudsters targeting the financial industry,

తస్మాత్ జాగ్రత్తా: ర్యాట్ తో అకౌంట్ ఖాళీ చేయిస్తున్న సైబర్ నేరగాళ్లు..

Posted: 08/25/2021 03:02 PM IST
Cyber criminals choose new way of fraud via remote access tool

సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సరికొత్త తరహాలో చీటింగ్ కు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్‌ లేదా ల్యాప్‌టాప్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి టీమ్‌వ్యూయర్‌, ఎనీడెస్క్‌, క్విక్‌ సపోర్టు యాప్‌లను డౌన్‌లోడ్‌ చేయించి.. యూపీఐ ఐడీ లేదా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా ఆర్థిక లావాదేవీలు జరిపించి బ్యాంక్‌ ఖాతాలను కొల్లగొట్టేవారు. పోలీసులు ఇలాంటి నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయడంతో.. కొత్త దారి ఎంచుకున్నారు. అదే.. రిమోట్‌ యాక్సెస్ ట్రోజన్ (ఆర్‌ఏటీ-ర్యాట్‌). దీని ద్వారా ఓ లింక్‌ను పంపుతారు. దానిని క్లిక్‌ చేసేలా మాటలతో బోల్తా కొట్టించి మీ ఖాతాల్లోని నగదును మాయం చేస్తారు.

ర్యాట్‌ (RAT) అంటే..
* రిమోట్‌ యాక్సెసింగ్‌ టూల్‌(రిమోట్ యాక్సెస్ ట్రోజన్) ద్వారా లింక్‌ను తయారు చేస్తున్న సైబర్‌ మోసగాళ్లు దానిని బల్క్‌ ఎస్ఎంఎస్ రూపంలో మొబైల్స్‌కు పంపిస్తున్నారు. * ఎస్బీఐ నుంచి పంపుతున్నట్టుగా చెబుతూ.. కేవైసీ అప్‌డేట్‌ చేసుకోకపోతే మీ ఖాతా మరో ఆరు గంటల్లో క్లోజ్ అవుతుందని హెచ్చరిస్తారు.
* తర్వాత స్వయంగా ఫోన్లు చేసి ఇటీవల మీరు జరిపిన లావాదేవీలకు కేవైసీ అప్‌లోడ్‌ లేకపోతే మీ ఖాతాల ఆర్థిక లావాదేవీలపై ఐటీ నిఘా ఉంటుందంటూ భయపెడతారు.
* వారు చెప్పినట్టు లింక్‌పై క్లిక్ చేస్తే ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను తలపించేలా పేజీ కనపడుతుంది. అందులో వివరాలను ఎంట్రీ చేయించి.. తర్వాత ఆన్‌లైన్‌ ద్వారా చిన్న ఆర్థిక లావాదేవీ జరిపిస్తారు. ఈ సమయంలోనే మన వివరాలన్నింటినీ వారు తమ స్క్రీన్‌పై చూసుకుని.. తాపీగా ఖాతాలను ఖాళీ చేస్తారు.

ఈ తరహా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు సూచించారు. సైబర్‌ క్రిమినల్స్ రిమోట్‌ యాప్‌ల స్థానంలో ఇప్పుడు ర్యాట్‌ ద్వారా లింక్‌లను రూపొందిస్తున్నారని, ఈ టూల్‌ ద్వారా మీరు నొక్కే ప్రతి బటన్‌ దృశ్యాన్ని సైబర్‌ నేరగాళ్లు ప్రత్యక్షంగా వీక్షించేలా వీలుంటుందన్నారు. దీనిపై ఇటీవల 10 ఫిర్యాదులు అందాయని చెప్పారు. వాటిని విశ్లేషించి.. విచారించగా ఈ విషయం బయటపడిందన్నారు. ఈ సైబర్‌ నేరగాళ్లు జార్ఖండ్‌ జామ్‌తారా, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాలకు చెందిన వారుగా అనుమానిస్తున్నాం అన్నారు. కాగా, కేవైసీని ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలంటూ ఏ బ్యాంక్‌ అడుగదని సైబర్ నిపుణులు స్పష్టం చేశారు. మీ ఖాతాలకు సంబంధించి ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా బ్యాంక్‌ అధికారులను సంప్రదించి పరిష్కరించుకోవాలని సైబర్ నిపుణులు సూచించారు.

ర్యాట్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి.?

1. విశ్వసనీయ యాప్ స్టోర్‌ల నుండి మాత్రమే యాప్‌లను డౌన్‌లోడ్ చేయండి.
2. మొబైల్ యాప్ డౌన్‌లోడ్‌ను ప్రోత్సహించే అయాచిత సందేశాలు లేదా నోటిఫికేషన్‌లకు ప్రతిస్పందించవద్దు.
3. మీ స్నేహితులు మీకు ఎస్ఎంఎస్, ఇమెయిల్, ఫేస్‌బుక్ పోస్ట్ మొదలైన వాటి ద్వారా మీకు సిఫార్సు చేసే యాప్‌లను డౌన్‌లోడ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.
4. మీరు ఒక అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేస్తే, దానికి ఎలాంటి అనుమతులు మంజూరు చేయబడ్డాయో చూడండి. యాప్ లలో వ్యక్తిగత వివరాలను యాక్సెస్ చేసేముందే జాగ్రత్తగా ఉండండి.
5. వ్యక్తిగత వివరాలను నిల్వ చేసే అనేక ఆర్థిక యాప్‌లు రెండు-కారకాలు లేదా రెండు-దశల ప్రమాణీకరణను అందిస్తాయి. వీటిని ఉపయోగించడం సురక్షితం.. ఎందుకంటే ఇది మీ పాస్‌వర్డ్‌ను దొంగిలించే లేదా ఊహించే హ్యాకర్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.
6. యాప్‌లను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి. అనేక యాప్ అప్‌డేట్‌లు, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్‌లు, కొత్త భద్రతా సమస్యలను పరిష్కరిస్తాయి.
7. మొబైల్ ఫోన్ల జైల్ బ్రేకింగ్ / రూటింగ్ వారి భద్రతను నాటకీయంగా బలహీనపరుస్తుంది. దాన్ని గుర్తుంచుకోండి.
8. మీరు మీ పరికరాన్ని రిమోట్‌గా నియంత్రించడానికి టీమ్ వ్యూవర్ లేదా ఎనీ డెస్క్ వంటి రిమోట్ యాక్సెస్ అప్లికేషన్‌ని ఇన్‌స్టాల్ చేస్తే, మీ పాస్‌వర్డ్ సురక్షితంగా ఉండేలా చూసుకోవడంతో పాటు రెండు-కారకాల ప్రమాణీకరణను ఉపయోగించండి. అతనికి లేదా ఆమె రిమోట్ యాక్సెస్ మంజూరు చేయమని ఎవరైనా మిమ్మల్ని అడిగితే, అలా చేయవద్దు. సోషల్ ఇంజనీరింగ్ స్కామర్లు చట్టబద్ధమైన కంపెనీల హెల్ప్ డెస్క్‌లుగా మరియు రిమోట్ యాక్సెస్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి వినియోగదారులను మోసం చేస్తారు, తద్వారా వారు మీ మొబైల్ బ్యాంకింగ్ లేదా చెల్లింపు అప్లికేషన్‌ల నుండి డబ్బును దొంగిలించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bank details  cyber cheating  Cyber criminals  cyber fraud  KYC  RAT  Cyber crime  

Other Articles