virender sehwag shares village boy buffalo bath video నగరప్రజలకు ఈ వినోదమే తెలియదు: వీరూ వీడియో వైరల్

Sehwag shares buffalo bath video says urban people misses pleasure

Instagram, village, virender sehwag, bathing on buffalo, former teamindia opener, Viral Video, Virender Sehwag instagram, West Bengal

Virender Sehwag, a former Team India opener and known for his fast batting, is known for his social media posts after retirement. Sehwag posted a video on social media on Tuesday which is becoming very popular. In the Sehwag video, a child is bathing while standing on a buffalo.

ITEMVIDEOS: నగరప్రజలకు ఈ వినోదమే తెలియదు: వీరూ వీడియో వైరల్

Posted: 08/25/2021 05:31 PM IST
Sehwag shares buffalo bath video says urban people misses pleasure

టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో తన సెకెండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. ఎంతలా అంటే.. ఇక్కడ ఆయన పోస్టు చేసిన ప్రతీ పోస్టు డబుల్ సెంచరీల తరహాలో వైరల్ అవుతుంటాయి. ఎప్పటికప్పుడు సరదా కామెంట్స్‌, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు తన అభిప్రాయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. దీంతో ఆయన పోస్టులు తన ఫ్యాన్స్ తో పాటు ఫాలోవర్లను కూడా ఆకట్టుకుంటాయి. తన పదునైన రాతలతో విమర్శకులకు ఇదే వేదిక ద్వారా జవాబిస్తుంటారు.

సెహ్వాగ్‌ పోస్టింగ్‌ల కోసం అభిమానులు ఎదురుచూస్తుంటారంటే అతిశయోక్తి కాదు. వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో అలరిస్తున్నది. ఈ వీడియోలో ఒక పిల్లవాడు బర్రెపై కూర్చోని (Bathing on Buffalo) ఎంచక్కా స్నానం చేసే వీడియోను షేర్ చేశారు. నల్లాకు పైపును పెట్టి దాని నుంచి వచ్చే నీటితో అటు బర్రెకు స్నానం చేయడంతో పాటు.. తానూ స్నానం చేస్తూ ఆ ఎంజాయ్‌మెంట్‌ను ఆస్వాదిస్తున్నాడు. పిల్లవాడు బర్రెపైన నిలబడి, కొన్నిసార్లు కూర్చొని, మరోసారి పడుకుని నీళ్లు పోస్తూ కనిపిస్తాడు.

ఈ వీడియోతో పాటు అందాజ్ చిత్రంలోని రాజేష్ ఖన్నా పాట ‘జిందగీ ఏక్ సఫర్ హై సుహానా’ ను జత చేయడం వీడియోకు మరింత అందం చేకూరింది. ‘పల్లె జీవితం.. నగరాల ప్రజలకు ఈ వినోదం తెలియదు’ అని ఈ వీడియోకు శీర్షికగా సెహ్వాగ్‌ రాశారు. ఒక్కరోజులోనే ఈ వీడియోకు 2.39 లక్షల మంది లైక్‌ కొట్టగా.. వేయికి పైగా నెటిజెన్లు కామెంట్లు రాశారు. మరెందరో దీన్ని షేర్‌ చేసుకున్నారు.

గ్రామంతో సెహ్వాగ్‌కి ఉన్న సన్నిహిత సంబంధాలు

వీరేంద్ర సెహ్వాగ్ స్వయంగా ఒక గ్రామీణ ప్రాంతంలో నివసించారు. సెహ్వాగ్ 20 అక్టోబర్ 1978 న నజాఫ్‌గఢ్‌లో జన్మించారు. ఇక్కడ అతను క్రికెట్ వర్ణమాల నేర్చుకున్నాడు. అప్పుడు సెహ్వాగ్ శిక్షణ కోసం ఫిరోజెషా కోట్లా స్టేడియంకు రావడం ప్రారంభించాడు. అతను కోట్లాలో ప్రాక్టీస్ చేయడానికి స్కూటర్‌లో ఆశిష్ నెహ్రాతో వస్తున్నాడు. సెహ్వాగ్‌కు పాలు అంటే చాలా ఇష్టం. ఆశిష్ నెహ్రాను తీసుకెళ్లడానికి తన ఇంటికి చేరుకున్నప్పుడల్లా అతను తన వాటా పాలు కూడా తాగేవాడు.

 
 
 
View this post on Instagram

A post shared by Virender Sehwag (@virendersehwag)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles