Kadiyam Srihari Sensational comments on Dalit Bandhu ‘దళితబంధు’పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Trs leader kadiyam srihari sensational comments on dalit bandhu scheme

Dalit Bandhi, CM KCR, Dalits schemes, Kadiyam Srihari, TRS, Etela Rajender, BJP, Sensational comments, Huzurabad by poll, Telangana, Politics

TRS Senior Leader and Former Deputy Chief Minister Kadiyam Srihari made Sensational comments on Implimentation of Dalit Bandhu scheme in the state.

‘దళితబంధు’పై టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు

Posted: 08/14/2021 08:42 PM IST
Trs leader kadiyam srihari sensational comments on dalit bandhu scheme

తెలంగాణ రాజకీయం మొత్తం ప్రస్తుతం దళితబంధు పథకం చుట్టూ తిరుగుతోంది. ఎన్నికలకు వ్యూహరచనలు చేసి.. ఓటర్లను తనవైపు ఆకర్షితుల్ని చేయడంలో నిష్ణాతులైన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్.. తన చేతిలోని అధికారాన్ని చేజారిపోనీయకుండా ఉండేందుకు ఇప్పటికే పలు ప్రణాళికలను రచించారు. టీఆర్ఎస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో నిలిచిన తనకు పోమ్మనకుండా పోగబెట్టారంటూ స్వయంగా ఈటెల అరోపించారు. తనకు ఉద్యమం నేపథ్యంలో లభించిన ప్రాధాన్యత.. పార్టీ అధికారంలో దక్కటేదని కూడా అరోపించారు.

ఉద్యమంతో పుట్టికోచ్చిన పార్టీలో వారసత్వం లేదని నాయకులదే ఫైచేయి అంటూ ఉద్యమ నేపథ్యంలో పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రస్తుతం ఉద్యమద్రోహులను పార్టీలో చేర్చుకుంటూ తెలంగాణ ప్రజలకు ఏం సందేశమిస్తున్నారని కూడా ప్రశ్నించారు. ఇక ఆయనను ఎట్టి పరిస్థితుల్లో ఓడించి పార్టీలో తన అధిపత్యానికి ఎలాంటి అడ్డు లేదని చాటేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. హుజూరాబాద్ లో ఉపఎన్నికలకు సిద్దమవుతున్న క్రమంలో దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారు కేసీఆర్.

ఈ పథకంలో భాగంగా ప్రతీ దళిత కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని తొలుత హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేయనున్నారు. ఎల్లుండి హుజూరాబాద్ సభలో కొందరు లబ్ధిదారులకు కేసీఆర్ చెక్కులను అందించనున్నారు.  మరోవైపు హుజూరాబాద్ ఉపఎన్నిక కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారని విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు కొందరికి మాత్రమే కాకుండా దళిత కుటుంబాలన్నింటికీ ఒకేసారి సాయాన్ని అందజేయాలని డిమాండ్ చేస్తూ హూజురాబాద్ లో దళితుల ధర్నాకు దిగారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ఇతర పార్టీల నేతలు దళితబంధు పథకాన్ని ప్రశంసించారు. మోత్కుపల్లి నర్సింహులు.. కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యానారాయణ ఈ జాబితాలో వున్నారు. కాగా సొంత పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాత్రం దళితబంధు పథకంపై సంచలన కామెంట్లు చేశారు. దళితబంధును పూర్తి స్థాయిలో అమలు చేయకపోతే టీఆర్ఎస్ కే నష్టమని అన్నారు. ఈ పథకాన్ని అమలు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఒకే ఏడాదిలో 15 లక్షల కుటుంబాలకు దళితబంధు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles