WhatsApp becomes prey to new delivery scams వాట్సాఫ్ యూజర్లూ.. ఆన్ లైన్ మోసగాళ్లతో తస్మాత్ జాగ్రత్తా..!

New delivery scam on whatsapp can rob you of your bank savings

WhatsApp,WhatsApp scam,WhatsApp fraud,WhatsApp username,WhatsApp password,WhatsApp account,WhatsApp cybercriminals,WhatsApp bank fraud,WhatsApp bank account scam,WhatsApp online scam,online scam,online fraud,how to prevent online scam,how to prevent online fraud,how to stop bank fraud,debit card fraud,debit card scam,debit card whatsapp scam,credit card,credit card scam,credit card whatsapp scam,credit card fraud

WhatsApp is one of the most popular instant messaging platforms which is honestly, hard to replace at this point, only because of its wide acceptance throughout the world. According to recent reports, criminals and attackers are exploiting the need of the hour, delivery, and global supply chain network to trick people into fraud and identity theft.

వాట్సాఫ్ యూజర్లూ.. ఆన్ లైన్ మోసగాళ్లతో తస్మాత్ జాగ్రత్తా..!

Posted: 08/14/2021 08:44 PM IST
New delivery scam on whatsapp can rob you of your bank savings

ప్రపంచమంతా కరోనావైరస్ మహమ్మారితో అల్లాడిపోతోంది. ఇదే సమయాన్ని అదునుగా భావించిన ఆన్ లైన్ కేటుగాళ్లు భారీగా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు ఈజీ మనీ కోసం కొత్త దారులు వెతుకుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్ ఫోన్ యూజర్లను ఎంచుకుని వారి వినియోగిస్తున్న యవాట్సాప్ ను టార్గెట్ చేసి మరో కొత్త స్కామ్ తెరపైకి తీసుకొచ్చారు హ్యాకర్లు.. నిజానికి వాట్సాప్ ను కోట్లాది మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనిని అధిపత్యానికి బ్రేకులు వేసేందుకు ఎన్నో కొత్త సందేశాత్మక యాప్ లు వచ్చినా.. ఇప్పటికీ వాట్సాఫ్ ఈ తరహా గ్రూపు యాప్ లకు బాస్ లానే వ్యవహరిస్తోంది.

అయితే వాట్సాప్ మోనార్క్ గా కొనసాగుతుండటంతో దీనినే టార్టెట్ చేసుకుని కొత్త తరహా మోసాలకు సైబర్ నేరగాళ్లు పాల్పడుతున్నారు. అదే.. న్యూ డెలివరీ స్కామ్. వాట్సాప్ ద్వారా వారు గ్రూప్ మెసేజింగ్ ద్వారా అనేక వాట్సాఫ్ యూజర్లకు హానికరమైన లింకులు పంపుతున్నారు. ఈ లింకులను ఓపెన్ చేస్తే మీ ఫోన్ లోని సమాచారం పూర్తిగా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతోంది. దీంతో యూజర్ల బ్యాంకు ఖాతాల్లో నగదును మాయం చేస్తారు జాగ్రత్త.. ఆన్ లైన్ ఆర్డర్ల పేరిట వాట్సాప్ యూజర్లకు హానికరమైన లింకులు పంపుతున్నారు.. ఆ లింకులు ఓపెన్ చేస్తే చాలు.. యూజర్ల విలువైన డేటా హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోతుంది.

మీకు తెలియకుండానే మీ బ్యాంకు అకౌంట్లలో నగదును దోచేస్తారని సైబర్ సెక్యూరిటీ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. రష్యాకు చెందిన సెక్యూరిటీ రీసెర్చర్స్ సంస్థ Kaspersky lab ఈ విషయాన్ని బయటపెట్టింది. ప్యాకేజీ డెలివరీ స్కామ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ యూజర్లను హెచ్చరిస్తోంది. ఆన్ లైన్ డెలివరీ కంపెనీల ఎగ్జిక్యూటీవ్ లుగా నమ్మించి మోసం చేసే అవకాశం ఉందని కాస్పర్ స్కై రీసెర్చర్లు అలర్ట్ చేస్తున్నారు. ఆన్‌లైన్‌ డెలివరీ సంస్థలు అందించే వస్తువులను వాట్సాప్‌ ద్వారా యూజర్లకు పంపుతున్నారట..

ఆ లింకులను క్లిక్ చేసి పేమెంట్‌ చేసే సమయంలో బ్యాంకు వివరాలను తెలుసుంటారు. అలా యూజర్ల బ్యాంకు బ్యాలెన్స్‌ను ఖాళీ చేసేస్తున్నట్టు కాస్పర్ స్కై కంపెనీ హెచ్చరిస్తోంది. అందుకే గుర్తుతెలియని ఆన్ లైన్ పార్సిళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వాట్సాప్ యూజర్లకు సూచిస్తోంది. ఫేక్ వెబ్ సైట్ల ద్వారా సైబర్ నేరగాళ్లు ఈ ఆన్ లైన్ ఆర్డర్ల లింకులను పంపుతున్నారని తెలిసింది. అనుమానాస్పందగా అనిపిస్తే.. అలాంటి వెబ్ సైట్లు లేదా లింకులను క్లిక్ చేయొద్దని యూజర్లను హెచ్చరిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp scam  whatsapp delivery scam  whatsapp  whatsapp messaging app  

Other Articles