Covid-19 delta variant challenges China's virus strategy చైనాలో డెల్టా వేరియంట్ విజృంభన..

China hunkers down as delta reaches nearly half the country

China, Coronavirus, Covid-19, Delta variant, Delta plus variant, World Health organization, maratorium, booster shots, china virus stategy, corona vaccine

China imposed new travel restrictions across the nation as a delta-driven outbreak grew to over 500 cases across 15 provinces, adding to the global case count that has now topped 200 million. The World Health Organization called for a moratorium on booster shots to enable poorer countries to catch up in vaccination rates, while the U.K. eased quarantine rules.

చైనాలో డెల్టా వేరియంట్ విజృంభన.. సగం దేశానికి పాకిన కేసులు

Posted: 08/05/2021 08:31 PM IST
China hunkers down as delta reaches nearly half the country

క‌రోనా మహమ్మారికి పుట్టిన‌ల్ల‌యిన చైనాను ఇప్పుడు అదే వైర‌స్‌కు చెందిన డెల్టా వేరియంట్ వ‌ణికిస్తోంది. కరోనా మహమ్మారి తొలిసారిగా విజృంభించిన నేపథ్యంలో సవాలుగా తీసుకుని వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకున్న డ్రాగన్ దేశానికి డెల్టా వేరియంట్ సవాలు విసురుతోంది. చాప కింద నీరుగా అంతకంతకూ విస్తరిస్తూ.. ఆ దేశ ప్రజలను అందోళనకు గురిచేస్తోంది. కరోనా విస్తరణకు చైనా అమలుపరుస్తున్న వైరస్ కట్టడి విధానం డెల్టా వేరియంట్ పై ప్రభావం చూపడం లేదు. క్రమేనా కేసుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి.

కరోనా డెల్టా వేరియంట్‌కు సంబంధించిన చైనాలో తొలుత కేవలం 500 కేసులు మాత్రమే నమోగు కాగా, ప్రస్తుతం డ్రాగన్ దేశంలో సగం జనాభాకు పైగా డెల్టా కేసులు విస్తరించింది, దీంతో ఆ దేశం మ‌రోసారి క‌ఠిన‌మైన ప్ర‌యాణ ఆంక్ష‌లు విధించింది. దేశంలో కేసులు ఎక్కువ‌గా ఉన్న 144 ప్రాంతాల్లో ప‌బ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌, ట్యాక్సీ సేవ‌ల‌ను ర‌ద్దు చేశారు. ఇటు బీజింగ్‌లోనూ రైలు, స‌బ్‌వే స‌ర్వీసుల‌ను నిలిపేశారు. ఇక్క‌డ బుధ‌వారం మూడు కేసులు న‌మోద‌య్యాయి. ఇక మెయిన్‌లాండ్ నుంచి వ‌చ్చే ప్ర‌యాణికుల‌కు క‌చ్చితంగా క్వారంటైన్‌ను విధించాల‌ని హాంకాంగ్ నిర్ణ‌యించింది.

గురువారం చైనాలో కొత్త‌గా 94 కేసులు న‌మోద‌య్యాయి. దేశంలోని జ‌నాభాలో 61 శాతం మందికి వ్యాక్సిన్లు వేసినా.. కేసుల సంఖ్య పెరుగుతుండ‌టం అక్క‌డి అధికారుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. చైనా ఇస్తున్న వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నాయా లేదా అన్న‌దానిపై ఇంత వ‌ర‌కూ స్ప‌ష్ట‌త లేదు. దీంతో వ్యాక్సినేష‌న్‌ను న‌మ్ముకోకుండా మ‌రోసారి క‌ఠిన‌మైన ఆంక్ష‌ల వైపే ఆ దేశం మొగ్గు చూపుతోంది. బీజింగ్‌లో థియేట‌ర్లు, పార్కులు వంటి అన్ని వినోద సంబంధిత ప్ర‌దేశాల‌పై ఆంక్ష‌లు విధించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles