ఉత్తర్ ప్రదేశ్ లోని కోత్వాలి పోలిస్ స్టేషన్ లో ఓ వింత ఘటన జరిగింది. స్టేషన్ లోనే అందరూ సిబ్బంది వుండగా ఓ యువతి ఏకంగా మహాళా పోలీసు కానిస్టేబుల్ పైనే దాడి చేసింది. యువతి దెబ్బలకు మహిళా హెడ్ కానిస్టేబుల్ పెట్టిన కేకలు, అరుపులతో స్టేషన్ లోని మిగతా పోలీసులు పరుగుపరుగున వచ్చి అమెను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వినటానికి విడ్డూరంగా ఉన్నా నిజం. పోలీస్ స్టేషన్ లోంచి ఓ ఆడగొంతు కేకలు విని ఉలిక్కిపడ్డ స్థానికులు.. కేకలు పెట్టింగి హెడ్ కానిస్టేబుల్ కాగా, కోట్టింది మాత్రం ఓ సాధారణ యువతి అని తెలుసుకుని షాక్ అయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని కొత్వాలి జిల్లాలోని హర్దోయీ పట్టణం పోలిస్ స్టేషన్ జరిగిన ఈ ఘటన అసలు వివరాల్లోకి వెళ్తే.. ..కాన్హా ద్వివేది అనే యువకుడు ఓ పోలీసు కేసులో ఇరుక్కున్నాడు. విచారణ కోసం పోలీసులు ద్వివేదిని పోలీసు స్టేషన్కు పిలిపించారు. ఈ క్రమంలో ఓ యువతి ఆ పోలిస్ స్టేషన్ కు వచ్చింది. ఆమె ద్వివేది సోదరి నిధి. మధ్యాహ్నం 12గంటల సమయంలో నిథి స్టేషన్ లోకి ఎంట్రీ ఇవ్వటమే తిట్లతో దూసుకొచ్చింది. రావడం రావడమే పోలీసులను నోటికొచ్చినట్లు తిట్టిపోయడం మొదలుపెట్టింది.
అదే సమయంలో స్టేషన్ డ్యూటీలో ఉన్న శీలూ అనే మహిళా కానిస్టేబుల్ ..పోలీసులను నోటికొచ్చినట్లుగా పచ్చిబూతులు తిడుతున్న నిధిని అడ్డుకుంది. ఏంటా తిట్లు నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడతావా? నువ్వు ఎవరు? ఎందుకొచ్చావు? ముందు చెప్పు అంటూ ప్రశ్నించింది. అంతే నిధి కోపం కట్టలు తెంచుకుంది. ఇతను నా సోదరుడి ద్వివేది. అతన్ని ఎందుకు పిలిపించారు స్టేషన్ కు అంటూ హెడ్ కానిస్టేబలు శీలూపై విరుచుకుపడింది. దానికి శీలూ ఏదో చెప్పబోయింది.
అక్కడితో ఆగకుండా పోలీసు అని కూడా చూడకుండా లెక్కచేయకుండా హెడ్ కానిస్టేబుల్ శీలూపైకి దూకి ఇష్టమొచ్చినట్లుగా కొట్టడం మొదలుపెట్టింది. ఏకంగా కానిస్టేబుల్ చెయ్యి మెలితిప్పి కొట్టడంతో.. శీలూ చేతిలోని ఘన్ కూడా కింద పడిపోయింది. నిధి నుంచి తప్పించుకోవటం ఆమె వల్ల కాలేదు. దాంతో శీలూ పెద్దగా అరిచి కేకలు పెట్టడంతో పోలీసు స్టేషన్లోని మరికొందరు కానిస్టేబుళ్లు అక్కడకు చేరుకుని శీలూను కాపాడారు. ఆ తరువాత పోలిస్ స్టేషన్ కొచ్చి పోలీసునే కొడతావా? అంటూ నిధి మీద కేసు నమోదు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more