Covaxin effective against Delta Plus variant, says ICMR డెట్లా ప్లస్ పై కోవాగ్జిన్ ప్రభావవంతం: ఐసీఎంఆర్

Covaxin effective against delta plus variant says icmr study

covaxin, delta plus, ICMR, ICMR study, coronavirus vaccine, Bharat Biotech, Pfizer, Covishield, corona vaccination

Covaxin, India's first indigenous vaccine to fight Covid-19, is effective against the Delta Plus variant of coronavirus, a study conducted by Indian Council of Medical Research (ICMR) has said, according to news agency ANI. Covaxin has been developed by Bharat Biotech, in collaboration with ICMR.

డెట్లా ప్లస్ వేరియంట్ పై ప్రభావం చూపుతున్న కోవాగ్జిన్: ఐసీఎంఆర్

Posted: 08/02/2021 05:31 PM IST
Covaxin effective against delta plus variant says icmr study

ప్రస్తుతం ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నది కరోనావైరస్ డెల్టా ప్లస్ వేరియంట్. ఇప్పటికే అటు అమెరికా ఇటు అస్ట్రేలియా సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. అయితే భారత్ లోనూ పలు రాష్ట్రాల్లో డెల్టా ప్లస్ కేసులు బయటపడ్డాయి. ఈ వైరస్ వేరియంట్ బారిన పడిన మహిళా రోగి మరణంతో డెల్టా వేరియంట్ తోలి మరణం కూడా దేశంలో నమోదైన విషయం తెలిసిందే. అయితే భారతీయులు అందులోనూ కోవాగ్జిన్ కరోనా టీకా తీసుకున్న వారు ఈ విషయంలో ఎలాంటి అందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తేలింది.

భారత్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన కొవాగ్జిన్‌ టీకా డెల్టా ప్లస్‌ వేరియంట్‌పై ప్రభావంతంగా పని చేస్తున్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్‌ బయోటెక్‌ కంపెనీ కొవాగ్జిన్‌ టీకాను ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ తో కలసి ఐసీఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసిన టీకా కోవాగ్జిన్. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 25 మిలియన్ల మంది కోవాగ్జిన్ టీకాను తీసుకున్నారిని సదరు సంస్థవర్గాలు తెలిపాయి.

కొవాగ్జిన్‌ రోగ లక్షణాలున్న వ్యక్తుల్లో 77.8శాతం ప్రభావం చూపగా.. కొత్త డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా 65.2శాతం రక్షణ కల్పించిందని భారత్‌ బయోటెక్‌ జూలైలో తెలిపింది. తీవ్రమైన కేసులపై వ్యాక్సిన్‌ 93.4శాతం సమర్థతను ప్రదర్శించిందని కంపెనీ వివరించింది. కొవిడ్‌-19 డెల్టా వేరియంట్‌ ప్రపంచదేశాలను వణికిస్తోంది. భారత్‌లో సెకండ్‌ వేవ్‌కు ఈ వేరియంట్‌ కారణమని తేలగా.. ప్రస్తుతం 132 దేశాలకు విస్తరించింది. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా, జపాన్‌, సింగపూర్‌ సహా పలు దేశాలను వణికిస్తున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covaxin  delta plus  ICMR  ICMR study  coronavirus vaccine  Bharat Biotech  Pfizer  Covishield  corona vaccination  

Other Articles