Meenakshi Lekhi apologises protesting farmers రైతులపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న కేంద్రమంత్రి

Meenakshi lekhi says hooligans not farmers remark misread takes back words

Meenakshi Lekhi, Meenakshi Lekhi news, farmers protest, farm laws, farmers protest in Delhi, Jantar Mantar protest, farmers Hooligans, farmers mawalis, national channel, National, politics, Crime

Union Minister of State for External Affairs Meenakshi Lekhi Thursday called the protesting farmers ‘mawalis’ (ruffians), inviting a sharp reaction from Punjab Chief Minister Amarinder Singh, who demanded her “immediate resignation” and said her remarks reflect the BJP’s “anti-farmer” mindset.

రైతులపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్న కేంద్రమంత్రి

Posted: 07/23/2021 05:27 PM IST
Meenakshi lekhi says hooligans not farmers remark misread takes back words

కేంద్రంలోని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులపై నోరు జారిన కేంద్ర మంత్రి మీనాక్షీ లేఖి తాను చేసిన వ్యాఖ్యలపై వెనక్కుతగ్గారు. అన్నదాతలపై అవమానకరంగా చేసిన తన వివాదాస్పద వ్యాఖ్యలను వెన్కు తీసుకున్న అమె అందుకుగాను వారికి క్షమాపణలు చెప్పారు. రైతులను అకతాయిలు అన్న అమె బేషరుతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అయితే తాను అకతాయిలు అని మాత్రమే అన్నానని, అంతకుమించి ఏమీ అనలేదని మంత్రి తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు.

ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అయిన సందర్భంగా రైతులు తమ నిరసనలకు కొనసాగిస్తూ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సమయంలో ఓ జాతీయ మీడియా ఛానల్ కు చెందిన సీనియర్ వీడియో జర్నలిస్టుపై దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై విలేఖరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మీనాక్షి లేఖి రైతులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘వాళ్లు రైతులు కాదు హూలిగాన్స్ (ఆకతాయిలు..పోకిరీలు)దుష్టులు అంటూ వ్యాఖ్యానించారు. వ్యవసాయం చేయటం మానేసి రోడ్లపై ఆందోళన చేసే వారిని రైతులు అని ఎలా అంటాం? ఆందోళన పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నవారిని రైతులు అని పిలవకూడదు అని వ్యాఖ్యానించారు.

అంతేకాదు కుట్రదారులతో చేతులు కలిపి ఆటలాడుతున్నారని.. ఇటువంటివారిని ఎలా సమర్థిస్తామని అమె ప్రశ్నించారు. నిజమైన రైతులు వారి పంటపొలాల్లో వ్యవసాయం చేస్తుంటారు.. ఇటువంటి పనులు చేయరని వ్యాఖ్యానించారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు రావటంతో ఆమె రైతులకు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని.. తాను కేవలం హూలిగాన్స్ అని మాత్రమే అన్నానని.. అంతకుమించి ఏమీ అనలేదని సమర్ధించుకున్నారు. ఇది రైతులను గానీ మరి ఎవరినైనా గానీ బాధపెట్టి ఉంటే.. క్షమాఫణ కోరుతున్నానని తెలిపారు. తన వ్యాఖ్యలను అమె వెనక్కి తీసుకున్నారు.

కాగా రైతుల ఆందోళనలో కొన్ని హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న క్రమంలో రైతుల ఆందోళనలో కొన్ని అసాంఘీక శక్తులు కూడా కలిసి ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారనీ గతంలో రైతులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ వీడియో జర్నలిస్టుపై దాడి జరిగింది. రైతుల ఆందోళనలను కవర్ చేస్తున్న క్రమంలో ఒక వ్యక్తి నన్ను లైట్ స్టాండ్ తో తలపై కొట్టాడు. అలా మూడుసార్లు నా తలపై కొట్టాడు. ఆ వ్యక్తి కిసాన్ మీడియా అని ఐడి కలిగి ఉన్నాడు. నేను. అతను రైతు కాదా అని నాకు తెలియదు.. అని నిరసనల్లో దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వీడియో జర్నలిస్ట్ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : meenakshi lekhi  union minister  farmers  hooligans  mawalis  national channel  national politics  crime  

Other Articles