viral video: Land starts rising abruptly in Haryana విచిత్రఘటన: నీటిని చీల్చుకుంటూ పైకి ఎగసిన భూమి

Land starts rising abruptly in haryana video leaves netizens shocked2

haryana ground, road rising flood water, land rises under water viral video, twitter reactions, Haryana, Crime

Even as the effects of climate change are being noticed in nations around the world, an undated video of the ground suddenly rising in Haryana has gone viral on social media. The clip, which has now garnered over 4.3 million views, was shared on the Facebook page Jagat Vani.

ITEMVIDEOS: విచిత్రఘటన: నీటిని చీల్చుకుంటూ పైకి ఎగసిన భూమి

Posted: 07/23/2021 12:10 PM IST
Land starts rising abruptly in haryana video leaves netizens shocked2

నింగిని చీల్చుకుంటూ ఉల్కలు వచ్చినట్టుగా.. నీటిని చీల్చుకుంటూ భూమి ఎప్పుడైనా పైకి రావడం చూశారా ? కానీ ఆలాంటి వింత ఘటన ఒకటి హర్యానాలో చోటుచేసుకుంది. ఇప్పటికే పలు సందర్భాలలో భూమి కుంగిపోవడం వంటి ఘటనలు భూమిపై పలు ప్రదేశాల్లో చోటుచేసుకున్నాయి, అయితే భూమి తానంతట తానే నీటిని చీల్చుకుంటూ పైఎగసింది. ఇది ఎలా సాధ్యమంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన వారు నోరెళ్ల బెడుతున్నారు. ఇది నిజమైనా అంటూ విస్మయం చెందుతున్నారు. పైకి లేచిన ఈ ప్రాంతాన్ని చూడటానికి భారీగా ప్రజలు తరలివస్తున్నారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలో చోటు చేసుకుంది.

కర్నాల్ లోని నైసింగ్ నార్ధక్ కాల్వ ఉంది. ఇక్కడనే ఓ పొలం ఉంది. గత రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయింది. వర్షం తగ్గుముఖం పట్టడంతో…స్థానికులు పొలం పనులు చేయడానికి సిద్ధమయ్యారు. అకస్మాత్తుగా నీటిని చీల్చుకుంటూ..భూమి పైకి రావడం కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు ఈ దృశ్యాన్ని సెల్ ఫోన్ లలో బంధించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అసలు భూమి పైకి ఎందుకు లేచిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇలాంటి ఘటన చూడడం తొలిసారి అని గ్రామస్థులు వెల్లడిస్తున్నారు. పొలాల్లో పనిచేసే సమయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles