TTD Board Shares Good News to Tirumala Srivari Devotees శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అద్దెగదుల నిరీక్షణకు చెక్.!

Ttd board shares good news to tirumala srivari devotees over rental rooms

Tirumala Ghat Road, Alipiri Toll Gate, Alipiri Steps route, Srivari mettu, Rental rooms scaning at Tirumala, Rental rooms scaning centres, SMS facility, Tirumala devotees, Turumala Executive Officer, Jawahar Reddy, Rooms allotment, Online room allotment, Andhra Pradesh, crime

Tirumala Tirupati Devasthanam Board shares good news with Srivari Devotees over Rental rooms allotment, says now devotees can scan their online booking reciepts at Tirupati instead of waiting at Tirumala.

తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. అద్దెగదుల నిరీక్షణకు చెక్.!

Posted: 07/23/2021 11:15 AM IST
Ttd board shares good news to tirumala srivari devotees over rental rooms

కలియుగ వైకుంఠధామంగా భక్తుల కోంగుబంగారంగా నిలిచే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భక్తులు ఎప్పటికప్పుడు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రం ఇసుక రాలనంత సంఖ్యలో జనం తిరుమలకు చేరుకుని దేవదేవడ్ని దర్శించుకుంటారు. ఇలా తిరుమల సప్తగిరులకు చేరుకునే భక్తులు అద్దె గదులు దొరక్క అవస్థలు పడుతున్నారు. అద్దె గదుల కోసం పెద్ద పెద్ద క్యూలైన్లు ఉంటున్నాయి. గంటల గంటలు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. భక్తులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దేవస్థానం బోర్డు వారికి ఉపశమనం కల్పించింది.

ఇకపై భక్తులకు మరింత వేగంగా, సులభంగా అద్దె గదులను అందించేందుకు టీటీడీ ఈవో జవహార్ రెడ్డి అధికారులను అదేశించారు. అందుకోసం మరో కొత్త సాప్ట్ వేర్ ను టీటీడీ అధికారులు వినియోగంలోకి తీసుకువచ్చారు. ఈ కొత్త విధానం ద్వారా తిరుమలకు చేరుకునే భక్తులు అద్దె గది కోసం ఆన్ లైన్ లో రిజర్వేషన్ చేసుకున్న భక్తులు గదుల కోసం తాము రిజర్వు చేసుకున్న స్లిప్పులను తిరుపతిలోనే స్కాన్ చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం అలిపిరి టోల్ గేట్, అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశామని అన్నారు.

తిరుమలకు రోడ్డు మార్గంలో వెళ్లేవారికి స్లిప్పులు స్కాన్‌ చేసుకున్న 30 నిమిషాల్లో, అలిపిరి నడకమార్గంలో వెళ్లేవారికి 3 గంటల్లో, శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లేవారికి గంటలో ఎస్‌ఎంఎస్‌లు వస్తాయన్నారు. ఎస్ఎంఎస్ రాగానే భక్తులు నేరుగా విచారణ కార్యాలయానికి వెళ్లి గదులు పొందొచ్చని తెలిపారు. టీటీడీ పరిపాలన భవనంలో గురువారం వసతి కల్పనకు నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారులతో ఈవో సమీక్షించారు. అనంతరం టీటీడీ కాల్‌ సెంటర్‌ ద్వారా వస్తున్న పలు ఫిర్యాదులను విభాగాల వారీగా సమీక్షించారు. అంతకుముందు రిసెప్షన్‌ అధికారులు నూతనంగా రూపొందించిన అకామిడేషన్‌ మేనేజ్ మెంట్‌ సిస్టమ్‌ సాఫ్ట్ వేర్ పై పవర్ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఈవోకు వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles