Andhra father gifts newlywed daughter 'Ashadam Sare' నెల రోజుల ఆషాడానికి.. ఆర్నేళ్ల సారే..

Andhra father gifts 1000kg fish 50 types of sweets 10 goats as ashadam sare

Ashada Masam, Non Veg Month, Battula Balarama Krishna, businessman, Yanam businessman, Thota Raju, Pavan Kumar, Newly wed daughter, Son In law, Vegetable Pickles, Sweets, auspicious month, Rajahmundry, East Godavari, Andrha pradesh, Viral news

In Andhra Pradesh, a father's present to his newly married daughter has become the talk of the town. During Ashadha Masam, the holy month in Telugu custom, a newly married daughter got a large quantity of fish, vegetables, pickles, and sweets as a present from her father. It is an auspicious month for newlyweds. During this occasion, the new bride gets presents from her parents, as it is customary.

ITEMVIDEOS: గోదావరి జిల్లా ఆషాడం సారె.. వీళ్ల ప్రేమలాగే చాలా పెద్దది..

Posted: 07/20/2021 01:30 PM IST
Andhra father gifts 1000kg fish 50 types of sweets 10 goats as ashadam sare

మాటల్లో మర్యాద మాత్రమే కాదు.. మనస్సులో ప్రేమ కూడా గోదావరిలా నిత్యం ఉప్పోంగుతూనే ఉంటుందన్న నానుడిని నిజం చేశాడో మామగారు. పెళ్లి సందడి చిత్రంలో రాఘవేంద్రరావు పెళ్లి సన్నివేశాల్లో చూపించిన వెటకారం, ప్రేమ కొంతే అని.. నిజంగా గోదావరి జిల్లావారిని చూస్తే అది అంతకుమించి అని ఇట్టే అర్థమవుతుందని అంటున్నారు అక్కడి ప్రజలు. యావత్ ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి కారణంగా కోవిడ్ నిబంధనలకు లోబడి అత్యత్ప సంఖ్యలోనే బంధువులతో కూతురికి వివాహం చేసిన తండ్రి.. తన కూతరుకి ఇచ్చ సారే మాత్రం టాక్ అఫ్ ది టౌన్ అయ్యేలా చేశారు.

అదెలా అన్న వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన ప్రముఖ వ్యాపారి బత్తుల బలరామకృష్ణ కుమార్తె ప్రత్యూషాదేవికి.. యానాంకు చెందిన వ్యాపారవేత్త తోటరాజు కుమారుడు పవన్ కుమార్ కు ఈ ఏడాది జూన్ లో ఘనంగా వివాహం జరిగింది. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా ఎక్కువ మంది బంధుమిత్రులను అహ్వనించకుండానే.. జరిపించేశారు. ఇంతలో ఆషాఢం రావడంతో బలరామకృష్ణ కుమార్తెకు సారె పంపారు. సారె అంటే అలాంటి ఇలాంటి సారె కాదు... తరతరాలు చెప్పుకునేలా ఘనంగా పంపారు. ఈ సారెను తీసుకుని కొన్ని లారీలు, జీపులు యానాంకు తరలి వెళ్లాయి.

ఇక అక్కడకు చేరిన సారె (కావిళ్ళు)ను భారీ ఊరేగింపు మధ్య వియ్యంకుల వారి ఇంటికి చేర్చారు. ఆ లిస్టు చదివితే మతిపోవడం ఖాయం. 100 రకాల మిఠాయిలు, 10 మేకపోతులు, టన్ను పండుగప్ప చేపలు, టన్ను కొరమేను చేపలు, 250 కేజీల బొమ్మిడాయిలు, 350 కేజీల రొయ్యలు, 50 పందెంకోళ్లు, 50బిందెలకొద్దీ తినుబండారాలు, పలు రకాలు ఫలాలు, 250 రకాల కిరాణా సామాన్లు, 200 జాడీల ఆవకాయ, టన్ను కూరగాయలు పంపారు. కోవిడ్ నిబంధనల కారణంగా తన కూతురి వివాహం ఘనంగా చేయలేకపోయానన్న తండ్రి తన కూతురికి ఘనంగా కావిళ్ళను పంపించాలని నిర్ణయించుకుని వాటిని సిద్దం చేయించి కుమార్తె మెట్టినింటకి పంపించారు. దీంతో ఔరా అనిపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles