గత కొన్ని రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాలకు రాష్ట్రవ్యాప్తంగా చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. రాష్ట్రంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కుండపోతలా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లోని పంటలకు అపారనష్టం వాటిల్లింది. చేతికందాల్సిన పంట అనేక ప్రాంతాల్లో నీట మునిగింది. ఇదిలావుండగా, ఇప్పటికే తడిసిముద్దైన రాష్ట్రాన్ని మరిన్ని వానలు కురువనున్నాయని వాతావరణ కేంద్రం తెలపింది.
రాష్ట్రంలో ఈ నెల 22, 23వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావం మరీ ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్ నగరంతో పాటు యాదాద్రి జిల్లాపై పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు వున్నాయని అధికారులు తెలిపారు. దీంతో హైదరాబాద్ వాతావరణ శాఖ జిల్లావాసులకు హెచ్చరికలు జారీ చేసింది. బయటకు వెళ్లేవారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
రాష్ట్రమంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. గత నెల 1 నుంచి నిన్నటి వరకు (19వ తేదీ) 258.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఏకంగా 409.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావడం గమనార్హం. అత్యధికంగా యాదాద్రి జిల్లాలో 178 శాతం వర్షపాతం నమోదైంది. ఇక, ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడగా, వికారాబాద్ జిల్లా బొంరాసిపేట మండలం దుడ్యాలలో గరిష్ఠంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది.
(And get your daily news straight to your inbox)
May 16 | నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ ను టార్గెట్ గా చేసుకుని విమర్శలు చేసిన బీజేపీ రాష్ట్రస్థాయి నేతపై దాడి చేసిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్టానం దిద్దుబాటు చర్యలకు దిగింది.... Read more
May 16 | ఆయనో ప్రోఫెసర్.. ఎదిగిన విద్యార్థులకు ఉన్నతమైన వ్యక్తులుగా.. ప్రోఫెషనల్ కోర్సులను బోధించే గౌరవప్రదమైన వృత్తిలో కొనసాగుతున్నాడు. అయితే ఆయన చేసిన పనే ఇప్పుడాయనను వార్తల్లో నిలిపింది. తాను ప్రోఫెసర్ అన్న విషయాన్ని మర్చిన ఆయన..... Read more
May 16 | సింగిల్ బిర్యానీ ఖరీదు ఎంత.. అంటే ఠక్కున వచ్చే సమాధానం రూ.150. సరే కొంత బెస్ట్ పాపులర్ హోటల్ బిర్యాని అయినా మహాఅంటే రూ.300. అలా కాదు స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీ... Read more
May 16 | ఈశాన్య రాష్ట్రం అసోంలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. వర్షంతో పాటు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజాజీవనం స్థంభించింది. వర్షం, వరదల కారణంగా ఇప్పటివరకు ముగ్గురు మరణించగా, అపార ఆస్తినష్టం వాటి్ల్లినట్లు... Read more
May 16 | అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోతమోగింది. న్యూయార్క్‌లోని బఫెలో ప్రాంతంలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో పడిన రక్తపు మరకలు గడ్డకట్టకముందే.. మరో రెండు ప్రాంతాల్లో కాల్పుల మోత మార్మోగాయి. బఫెలో కాల్పుల ఘటన... Read more