Miscreant cons villagers by selling plastic eggs in Andhra Pradesh చైనా కోడిగుడ్లు.. నేలకేసి కోట్టినా బంతిలా ఎగురుతున్నాయ్.!

People shocks over eggs being bounced in nellore of andhra pradesh confirms it as plastic ones

shocking incident, fake eggs, jumping eggs, Eggs jumping Like Balls, bouncing eggs, china eggs, eggs, plastic eggs, selling plastic eggs, plastic eggs, plastic egg Nellore, miscreant cons villagers, Food Safety, Nellore district, Varikuntapadam mandal, Udayagiri constituency, Nellore, Andhra Pradesh, Crime

The shocking incident was reported in the Nellore district where the eggs have turned hard like a stone after being boiled at hundred degrees. The reason for it is found to be that they are plastic eggs. The incident of plastic eggs has become the stir all over the Varikuntapadam mandal of Nellore district.

ITEMVIDEOS: నెల్లూరులో నకిలీ కోడిగుడ్లు.. నేలకేసి కోట్టినా బంతిలా ఎగురుతున్నాయ్.!

Posted: 07/20/2021 03:11 PM IST
People shocks over eggs being bounced in nellore of andhra pradesh confirms it as plastic ones

అహార భద్రత, నాణ్యత విషయంలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ విభాగం అధికారులు తమ విధులను పక్కనబెట్డి ఆదమర్చి నిద్రపోతున్న నేపథ్యంలో ప్రజల అరోగ్యంతో నకిలీ కేటుగాళ్లు ఆటలాడుతకుంటున్నారు. ఆ మధ్యకాలంలో చైనా తయారు చేసిన ప్లాసిక్ గుడ్లు వీడియోలు నెట్టింట్లో హల్ చల్ చేశాయి. అయితే ఇప్పుడు ఆ గుడ్లు నెల్లూరు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. గుడ్లును ఉధయం నుంచి మధ్యాహ్నం వరకు ఉడికించినా.. అవి ఎంతకీ ఉడకకపోవడంతో వాటిని నకిలీ గుడ్లుగా గుర్తించారు,

జరిగిన విచిత్రాన్ని ఇరుగుపోరుగువారికి కూడా చూపించి.. వారి సమక్షంలో ఉడకబెట్టిన గుడ్డును బయటకు తీసి పగలగొట్టగా.. చుట్టువున్న ఉమ్మనీరు కాసింత గట్టిబడినా.. మధ్యలోని సోన మాత్రం అలానే వుండటంతో ఇది నకిలీ గుడ్డు అని నిర్థారించారు. ఇక ఈ గడ్డును కింద నేలకేసి కొడితే బంతిలా ఎగురుతుండడంతో అవి చైనా గుడ్లు అనికొనుగోలుదారులు ఓ నిర్ధారణకు వచ్చారు. జిల్లాలోని వరికుండపాడులోని సంతలో కొందరు వ్యక్తులు ఆటోల్లో తీసుకొచ్చి కోడిగుడ్లు విక్రయించారని, కాగా దుకాణాల్లో ఒక్క ట్రే 180 రూపాయల ధరల పలుకుతుండగా, వీరు కేవలం రూ. 130లకే విక్రయించారని కొనుగోలుదారులు చెప్పారు.

యాభై రూపాయల మేర తక్కువకు 30 కోడిగుడ్లు రావడంతో తాము వాటిని కొన్నామని.. తమతో పాటు ఆటో వద్ద గుమ్మిగూడిన జనం కూడా ఎగబడి మరీ కోన్నారని చెప్పారు. వాటిని ఉడికించేందుకు ప్రయత్నించగా ఎంతకీ ఉడకకపోవడంతో అనుమానం వచ్చిన ఓ మహిళ వాటిని నేలకేసి కొట్టగా బంతిలా ఎగిరిపడ్డాయి. దీంతో అవి ప్లాస్టిక్ కోడిగుడ్లుగా భావించి వాటిని కట్ చేయగా లోపల పచ్చగా ఉన్న సొన తెల్లగా ప్లాస్టిక్‌లా ఉండడంతో తాము మోసపోయినట్టు గుర్తించారు. నకిలీ కోడిగుడ్ల వ్యవహారం కలకలం రేపడంతో స్పందించిన పశువైద్యాధికారి వాటిని పరిశీలించారు. వీటిని ల్యాబ్‌కు పంపి పరీక్షలు చేయించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles