Govt collects Rs 1.01 lakh crore from excise in Q1 ఎక్సైజ్ పన్నుతో ఏడాదికి కేంద్రానికి రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం

Excise collection from petrol diesel up 88 at rs 3 35 lakh crore on last year s tax hike

excise duty on fuel, Petrol Diesel prices, Excise duty collection, Covid in india, covid lockdown, Crude Prices, Question Hour, Question hour in lok sabha, Ministry of Petroleum, Ministry of Natural Gas, ministry of petroleum and Natural Gas, Crude Oil prices, Rameswar Teli

The Centre has collected Rs 94,181 crore through excise duty levy on petrol and diesel during the first quarter period of 2021-22. Excise duty on petrol was hiked from ₹ 19.98 per litre to ₹ 32.9 in 2020-21 in order to take advantage of falling international crude prices.

ఇంధనంపై ఎక్సైజ్ పన్నుతో ఏడాదికి కేంద్రానికి రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం

Posted: 07/20/2021 11:25 AM IST
Excise collection from petrol diesel up 88 at rs 3 35 lakh crore on last year s tax hike

దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. కేంద్ర, రాష్ట్రాలు మాత్రం తాము విధించిన పన్నుపోటును మినహాయించుకుని వాహనదారులకు ఊరట కల్పించడంలో మాత్రం నిరాకస్తతను ప్రదర్శిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నా వారి కష్టాలను కనీసం ఓర కంట కూడా చూడని కేంద్రం.. వారు చెల్లించే పన్నుతో మాత్రం ఏకంగా మూడు లక్షల కోల్ల రూపాయలను ఆర్జించింది. కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్‌ పన్ను వసూళ్లు  రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం  పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయి.

ఈ మేరకు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి రామేశ్వర్ లోక్ సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగాల్సి ఉందని అయితే కరోనా మహమ్మారి, లాక్‌డౌన్‌ ఆంక్షల సంక్షోభం కారణంగా  విక్రయాలు లేక రాబడి క్షీణించిందన్నారు. అయితే కరోనా మహమ్మారి డిమాండ్‌ భారీగా పడి పోయినప్పటికీ 2020-21లో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు) పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని మంత్రి ప్రకటించారు.  గత ఏడాది రూ .1.78 ట్రిలియన్ల నుంచి  ఈ మేరకు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్,లాక్‌డౌన్‌, రవాణా ఆంక్షలు ఇంధన అమ్మకాలను దెబ్బతీసాయనీ చెప్పారు.

ఈ ఏడాది ఏప్రిల్-జూన్నెలల్లో ఎక్సైజ్ వసూళ్లు మొత్తం రూ.11.1 ట్రిలియన్లని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో  వెల్లడించారు. ఇందులోపెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఏటీఎఫ్, నేచురల్ గ్యాస్ ఎక్సైజ్  సుంకం కలిసి ఉందన్నారు. 2020-2021లో మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ .3.89 ట్రిలియన్లు. కాగా 2018-19లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ వసూళ్లు రూ.2.13 ట్రిలియన్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్ వసూళ్లు రూ .2.94 లక్షల కోట్లగా ఉంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ .19.8 నుంచి రూ .32.9 కు, డీజిల్‌పై రూ.15.83 నుంచినుంచి  రూ. 31.8 మేరక రికార్డు స్థాయికి పెంచిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles