Pegasus spyware row: Opposition corners govt పెగసస్ స్పై వేర్ తో ప్రముఖల ఫోన్లు హ్యాకింగ్: సత్యదూరమన్న కేంద్రం

Attempt to malign democracy and its well established institutions it minister

Ashwini Vaishnaw, IT minister on Pegasus report, pegasus hack, IT minister Ashwini Vaishnaw, Vaishnaw in Parliament, Pegasus spyware issue, Pegasus issue, Congress demands sacking of Amit Shah,Prime Minister Narendra Modi,probe on pegasus spyware issue, Pegasus spyware, Congress, independent probe, Amit Shah, PM Modi, National Politics

Responding to allegations that it could be using Pegasus, spyware developed by the Isralei company NSO to snoop on journalists, politicians and activists, Modi government called the story “sensational”, seeming to be an attempt “to malign Indian democracy and its well established institutions”

పెగసస్ స్పై వేర్ తో ప్రముఖల ఫోన్లు హ్యాకింగ్: సత్యదూరమన్న కేంద్రం

Posted: 07/19/2021 09:17 PM IST
Attempt to malign democracy and its well established institutions it minister

ఇజ్రాయిల్ కు చెందిన పెగాసస్ స్పైవేర్ తో దేశంలోని పలువురు ప్ర‌ముఖుల ఫోన్లు హ్యాక్ అవుతున్నాయన్న వార్త కథనం ప్రచురితమైన క్రమంలో దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది. పెగాస‌స్ హ్యాకింగ్ నివేదిక‌పై ఇవాళ పార్ల‌మెంటులోనూ దుమారం చెల‌రేగింది. అయితే ఆ స్పై వేర్‌తో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, రాజ‌కీయ వ్యూహాక‌ర్త ప్ర‌శాంత్ కిషోర్‌, కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్ ల‌ను కూడా టార్గెట్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

హ్యాక్ అయిన డేటాబేస్‌లో సుమారు 300 మంది భార‌తీయుల ఫోన్ నెంబ‌ర్లు ఉన్నాయి. దాంట్లో 40 మంది జ‌ర్న‌లిస్టులు కూడా ఉన్న‌ట్లు ప్రాథ‌మికంగా తెలుస్తోంది. 2018 నుంచి 2019 మ‌ధ్య పెగాస‌స్ స్పైవేర్‌తో వాళ్ల‌ను టార్గెట్ చేసిన‌ట్లు ఓ నివేదిక‌లో తేలింది. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆ హ్యాకింగ్ త‌తంగం సాగిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ, స్టాలిన్ గెలుపుల్లో కీల‌క పాత్ర పోషించిన ప్ర‌శాంత్ కిశోర్ ఫోన్ కూడా హ్యాకైన‌ట్లు తెలుస్తోంది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్‌వో కంపెనీ పెగాస‌స్ స్పైవేర్‌ను అమ్ముతోంది.

ఈ కథనాలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇచ్చారు. ఇవాళ లోక్ సభలో ఆయన మాట్లాడుతూ, ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని, గతంలోనూ ఇలాంటివి వినిపించాయని అన్నారు. ఇవి నిరాధారమైన ఆరోపణలని స్పష్టం చేశారు. ఫోన్ హ్యాకింగ్ పై ఓ వెబ్ పోర్టల్ లో సంచలన కథనం వచ్చిందని అన్నారు. అయితే, సరిగ్గా లోక్ సభ సమావేశాల ప్రారంభానికి ముందే ఇలాంటి కథనాలు రావడాన్ని తాము కాకతాళీయం అని భావించడంలేదని ఆయన తేల్చిచెప్పారు.

ఓ ప్రముఖ వెబ్ సైట్లో ఈ కథనాలను ఉద్దేశపూర్వకంగానే ప్రచురించారని తాము నమ్ముతున్నామని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. వాట్సాప్ ను హ్యాక్ చేస్తున్నట్టు గతంలోనూ ఆరోపణలు వచ్చాయని అయితే అవి కేవలం కల్పిత కథనాలుగానే మిగిలిపోయాయని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని అప్రదిష్ఠ పాల్జేసేందుకే ఈ కథనాలు రూపొందిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంటు సమావేశాలకు ఒకరోజు ముందు సంచలన కథనం రావడం వెనుక ఆంతర్యం ఏమిటో గ్రహించాలని పేర్కొన్నారు.

ఇక ఈ కథనాల నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ఇక పడక గదిలో మాటలు కూడా వింటుందని కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. ఇజ్రాయెల్ నిఘా సాఫ్ట్‌వేర్ ‘పెగాసస్‌’ ద్వారా మోదీ ప్రభుత్వం గూఢచర్యానికి పాల్పడుతున్నదని ఆరోపించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, పలువురు శాసనసభ్యులు, సీనియర్‌ ప్రతి పక్ష నేతలు, న్యాయవాదులు, జర్నలిస్టులతోపాటు ఇతర రంగాలకు చెందిన వారి సెల్‌ ఫోన్లను అక్రమంగా హ్యాక్‌ చేయడం రాజద్రోహమని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది.

ఈ డేటాను విదేశీ కంపెనీ పొందడం జాతీయ భద్రత డొల్లతనానికి నిదర్శనమని విమర్శించింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను తొలగించాలని, ప్రధాని నరేంద్ర మోదీపై దర్యాప్తు జరుపాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేసింది. మరోవైపు కుమార్తెలు, భార్యలు, కుటుంబ సభ్యుల మొబైల్‌ ఫోన్లలో కూడా పెగాసెస్‌ చొరబడవచ్చని కాంగ్రెస్‌ అధికారి ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా హెచ్చరించారు. అప్పుడు బాత్‌ రూమ్‌, బెడ్‌ రూమ్‌లో మాట్లాడుకున్నవి కూడా మోదీ ప్రభుత్వం రహస్యంగా వింటుందని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles