Scientists develop pain-free blood sugar test for diabetics మదుమేహ రోగులకు శుభవార్త.. ఇక రక్త పరీక్షలకు చెక్.!

Scientists develop pain free way to test blood sugar with a strip saliva

Australian scientists, pain-free blood sugar test, diabetics, non-invasive strip, glucose levels via saliva, blood sugar levels, diabetes sufferers avoid painful process, Australian scientists, pain-free sugar test, diabetics, glucose levels, saliva, blood sugar, drop of blood, testing strip

Australian scientists say they have developed pain-free blood sugar testing for diabetics, a non-invasive strip that checks glucose levels via saliva.

మదుమేహ రోగులకు శుభవార్త.. ఇక రక్త పరీక్షలకు చెక్.!

Posted: 07/19/2021 08:07 PM IST
Scientists develop pain free way to test blood sugar with a strip saliva

మధుమేహ వ్యాధి గ్రస్తులకు అస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు శుభవార్తను చెప్పారు. ఇక షుగర్ టెస్ట్ అంటే ఎవరూ భయపడాల్సిన పనిలేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను తెలుసుకునేందుకు అవలంభించిన పద్దతికి స్వస్తి పలికే సమయం ఆసన్నమైందని అన్నారు. డయాబెటిస్ పరీక్ష మరింత సులభతరం కానుందని తెలిపారు. రక్తంలో చక్కెర స్థాయిని పరీక్షించే విధానానికి బదులుగా లాలాజలంతోనే ఆ పరీక్ష చేయనున్నారు.

ఆస్ట్రేలియాలోని న్యూ క్యాజిల్ యూనివర్సిటీ  శాస్త్రవేత్తలు ఈ సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఈ నయా పద్ధతిని ‘హోలి గ్రెయిల్’గా పిలుస్తున్నారు. ఈ విధానం వల్ల మధుమేహ పరీక్ష చేయించుకున్న ప్రతిసారీ రక్తం ఇచ్చే బాధ తప్పుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. గ్లూకోజ్‌ను గుర్తించే ఎంజైమును ట్రాన్సిస్టర్‌లో పొందుపర్చడం ద్వారా లాలాజలంలో గ్లూకోజ్ స్థాయిని గుర్తించవచ్చని తెలిపారు. ఇదే విధానం ద్వారా కొవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు హార్వర్డ్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles