Man drives stolen Range Rover on railway tracks, బ్రిటన్ లో రైలు పట్టాలపై పరుగులు పెట్టిన రేంజ్ రోవర్ కారు..!

Grand theft auto car driven on railway tracks at cheshunt to escape police

grand theft auto, man drives stolen car into train tracks, stolen range rover railway track, man police chase railway track, Cheshunt railway station, Thief, Car Theft, Railway Tracks, Police, Cheshnut railway station, Grand Theft Auto (GTA), London, Britain viral videos

It’s not everyday that life imitates art, but for commuters near a UK railway station, a police chase of a stolen vehicle reminded them of ‘Grand Theft Auto (GTA)’. In a video going viral, a thief in his attempt to evade arrest, drove the vehicle on railway tracks, and the thrilling video of the chase is breaking the internet.

ITEMVIDEOS: జీటీఏ వైస్ సిటీ: బ్రిటన్ లో రైలు పట్టాలపై పరుగులు పెట్టిన రేంజ్ రోవర్ కారు..!

Posted: 07/19/2021 03:28 PM IST
Grand theft auto car driven on railway tracks at cheshunt to escape police

జీటీఏ వైస్ సిటీ అనే గేమ్ గురించి ఎప్పుడైనా విన్నారా..? ఆరో తరగితి విద్యార్థుల నుంచి యువకులు వరకు ఈ గేమ్ గురించి తెలియని వారుండరు. అంతలా ప్రపంచ వ్యాప్త గేమర్లను అకర్షించింది ఈ గేమ్. దీని తరువాత వచ్చి పబ్జీ యువతను అకర్షించినా.. తనకు ఏ మాత్రం ఢోకా లేదని ఈ మొబైల్ గేమ్స్ నిరూపించాయి. ఇక ఈ గేమ్ గురించి ఎందుకు చెపుకుంటున్నామంటే అందులోనూ ఓ వ్యక్తి రకరకాల వాహనాలను తీసుకుని తన లక్ష్యానికి చేరుకుంటాడు. అయితే సరి్గ్గా అ గేమ్ లో మాదిరిగానే ఓ వ్యక్తి కూడా తాను తప్పించుకోడానికి తన రేంజ్ రోవర్ కారును ఏకంగా రైల్వే ట్రాకులపైనుంచి నడిపించడం గమనార్హం.

ఈ ఘటన బ్రిటన్ లో చోటుచేసుకుంది. ఓ కాస్ట్లీ కారును కొట్టేసిన ఓ దొంగ తనను పట్టుకున్న పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో చేసిన ప్రయత్నాలు ఇప్పడు నెట్టింట్లో వైరల్ గా మారాయి. కారు దొంగతనం సీన్‌ సినిమాను తలపించే విధంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. యూకేలోని చెస్ నట్ రైల్వే స్టేషన్‌లో ఓ దొంగ  ల్యాండ్ రోవర్ డిస్కవరీ కారును దొంగిలించడానికి పథకం వేశాడు. ఇది గుర్తించిన పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిని తోసేసి కారులోనే తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనను అడ్డుకుంటున్న ఇద్దరు పోలీసులను నెట్టేసి కారును రివర్స్ లో పోనిచ్చాడు.

అప్పటికే ఓ పోలిసు కిందపడగా మనో పోలీసులు కారును వెంబడిస్తూనే వచ్చి ఆయన కూడా బోర్లాపడి పల్టీలు కోట్టాడు. కారు రివర్స్ లో వెళ్లి మరో కారును ఢికొనింది. దీంతో ముందు ఉన్న పోలీసును తప్పించుకుని రైయ్ మంటూ దూసుకుంటూ వెళ్లి రైల్వే క్రాసింగ్ గేటును ఢీకోట్టించి పట్టాలపైకి రేంజ్ రోవర్ ను ఎక్కించాడు. అంతేకాదు దానిని పట్టాలపైనే స్పీడుగా పోనిచ్చాడు. కాగా, కారును పట్టాలపై కొంత దూరం పరుగు పెట్టించిన దొంగ అక్కడే వదిలేసి పారిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియోపై ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ‘‘ఈ సీన్‌ గ్రాండ్ తెఫ్ట్ ఆటో (జిటిఏ) గేమ్‌ను గుర్తు చేసింది.’’ అంటూ కామెంట్‌ చేశాడు. మరో నెటిజన్‌ ‘‘ ఈ సీన్‌ కంప్యూటర్‌ గేమ్‌లను తలదన్నేలా ఉంది.’’ అంటూ రాసుకొచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles