Navjot Singh Sidhu appointed as Punjab Congress chief పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ.!

Navjot singh sidhu appointed as punjab congress president with immediate effect

Navjot Sidhu, navjot singh sidhu, Punjab Congress, congress internal conflicts, punjab, Priyanka Gandhi Vadra, parliament, Pakistan army, navjot singh sidhu, CM Amarinder Singh, amarinder singh, Punjab, Politics

Congress president Sonia Gandhi appointed Navjot Sidhu as the head of Punjab Congress, ignoring the strenuous objections raised by party leaders, led by CM Amarinder Singh, and settling the issue that has been the source of much squabbling and instability over the last two months.

పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్దూ.!

Posted: 07/19/2021 01:22 PM IST
Navjot singh sidhu appointed as punjab congress president with immediate effect

పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు సుస్ఫష్టంగా కనిపిస్తున్నాయని, ఈ తరుణంలో వాటిని విఛ్చిన్నం చేసేలాంటి ఎలాంటి చర్యలను ప్రోత్సహించరాదని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి చేసిన విన్నపాలను తోసిరాజుతూ మాజీ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకు పీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్‌తో నవజ్యోత్ సింగ్ సిద్దూకు మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో సిద్ధూకు పీసీసీ పదవి ఇచ్చి బుజ్జగించాలని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

సోనియాకు రాసిన లేఖలో సిద్దూను పీసీసీ పీఠంపై కూర్చోబెడితే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న హిందూ, దళిత వర్గాలకు చెందిన సీనియర్లకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అంతేకాదు, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలపైనా ఈ ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసినా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్దూకే పిసిసి అధ్యక్షుడిగా ఎంపికి చేసింది. టీమిండియా మాజీ క్రికెట్ పార్టీని బలోపేతం చేస్తాడని భావించింది. ఆయనకు పార్టీ పగ్గాలను అప్పగిస్తే పార్టీలో యువరక్తం కూడా వచ్చి చేరుతుందని, తద్వారా పార్టీ బలోపేతం అవుతుందని కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయపడింది.

దీంతో పంజాబ్ పిసిసి అధ్యక్షుడిగా నవజ్యోత్ సింగ్ సిద్ధూను నియమిస్తూ గత రాత్రి  ప్రకటించారు. ఆయనతోపాటు మరో నలుగురిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమిస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ పర్యవసానాల నేపథ్యంలో ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ మాత్రం సిద్దూతో అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. సిద్దూను తమ ఇంటికి బోజనాలకు అభ్వానించాలని ముందుగా నిర్ణయించుకున్న అమరీందర్ సింగ్.. తాజా పరిణామాల నేపథ్యంలో మాత్రం సిద్దూను పిలవకుండా మిన్నకుండిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Navjot singh sidhu  PPCC President  Sonia Gandhi  Priyanka Gandhi  Rahul Gandhi  Punjab  Politics  

Other Articles