Kokapeta Land Sale: Revanth Reddy House Arrested! రేవంత్, భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్..

Revanth reddy and other congress leaders placed under house arrest

Telangana Congress leaders House Arrest, TPCC president Revanth Reddy House Arrest, Kokapet Land scam, Government land scam, Auction sacm, Land scam, Telangana Congress, Revanth Reddy, Kokapet, Government land, Auction, Land scam, 1000 crore scam, Telangana, Politics

Following grave charges leveled by Congress against the way the Telangana government auctioned Kokapet’s lands, scores of leaders including TPCC chief A Revanth Reddy were placed under house arrest, since wee hours on Monday.

రేవంత్, భట్టి సహా పలువురు కాంగ్రెస్ నేతల అరెస్ట్..

Posted: 07/19/2021 12:44 PM IST
Revanth reddy and other congress leaders placed under house arrest

టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు గృహనిర్భంధంలో వుంచారు. ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడైన రేవంత్ తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు.. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా వేలం వేసిన కోకాపేట భూములలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని అరోపించిన రేవంత్ రెడ్డి.. తమ పార్టీ ఇవాళ వాటిని సందర్శించనుందిని నిన్ననే ప్రకటించారు. దీంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున మూడు గంటల నుంచి భారీగా పోలీసులు మొహరించారు.

రేవంత్‌రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు ఎవ్వరూ కోకాపేట భూములను సందర్శించడానికి వీలు లేదని పోలీసులకు అదేశాలు జారీ చేసిందో లేక వారే ముందుజాగ్రత్తా రేవంత్, భట్టి మల్లు విక్రమార్క సహా పలువురు కాంగ్రెస్ నేతలను వారి ఇళ్లలోనే గృహ నిర్బంధం చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు. రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల సందర్శనతో పాటు అక్కడ ధర్నా కూడా చేయాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ భూముల వేలంలో వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఆయన అరోపించారు.

ఈ క్రమంలోనే పోలీసులు రేవంత్ రెడ్డిని,సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ని హౌస్‌ అరెస్ట్‌ చేశారు.  టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు కొకాపేట భూములను ముట్టడించి కాంగ్రెస్ జెండాలను పాతారు. ఈ క్రమంలో  పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, డీసీసీ అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి తదితర నాయకులు అరెస్టు చేశారు. అరెస్ట్‌ చేసిన వారిని గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వం తక్కువ ధరలకు టిఆర్ఎస్ అనుచరులు, కేసీఆర్ బినామీలు వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడారని వారు ఆందోళన చేశారు.  కాగా పోలీసుల తోపులాటలో కింద పడి పోయిన మహేష్ కుమార్ గౌడ్ కాలికి గాయాలయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana Congress  Revanth Reddy  Kokapet  Government land  Auction  Land scam  1000 cr scam  Telangana  Politics  

Other Articles