Hyderabad witnesses over 200mm of rainfall తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాదులో కుండపోత..

Heavy rain lashes hyderabad leaves many areas inundated

hyderabad heavy rains, IMD Red Alert, Indian meteorological department, Southwest monsoon, Telangana Heavy Rains, Hyderabad rains, Telangana Rains, Sangareddy, Rangareddy, Medak, Yadadri, Telangana Red Alert, Emergency services, GHMC numbers

On Wednesday night, which went on till early Thursday morning. Several localities in the city, including Hayathnagar, Uppal, Saroornagar and Saidabad received heavy rains overnight. Meanwhile, Bandlaguda, Uppal received the maximum rainfall of 212.5 mm, followed by Vanasthalipuram, which witnessed 192.3 mm rain. Kapra, Serilingampally, Khairatabad, Golconda and Marredpally also experienced moderate rains.

తెలంగాణలో భారీ వర్షాలు.. హైదరాబాదులో కుండపోత..

Posted: 07/15/2021 03:48 PM IST
Heavy rain lashes hyderabad leaves many areas inundated

తెలంగాణలో భారీ వర్షాలకు పలు గ్రామాలు, కాలనీలతో పాటు లోత్టటు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని అత్యధిక జిల్లాలు అతలాకుతలమయ్యాయి. అనేక గ్రామాల్లో జనజీవనం స్థంభించిపోయింది. ఇక రాబోయే రెండు, మూడు రోజుల్లో కూడా రాష్ట్రంలో భారీ వర్షాలుకురిస్తాయన్న వాతవరణ శాఖ అధికారులు హెచ్చరికలతో తెలంగాణలోని పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ సహా ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాలకు వాతవరణ కేంద్రం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు.

ఏదేని అత్యైయిక పరిస్థితి ఏర్పడిన తరుణంలో ప్రభుత్వం కాల్ సెంటర్లకు సమాచారం అందించాలని అధికారులు  సూచనలు జారీ చేశారు. కాగా ఈ ఐదు జల్లాల్లోని పలు  ప్రాంతాల్లో 22 సెం.మీకు పైగా వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. కుండపోత వానకు రహదారులన్నీ నీటమునిగాయి. కాలనీలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. మూసి పరివాహక ప్రాంతాల్లో డ్రైనేజీలు ఉప్పొంగి పొర్లుతున్నాయి.

నగరంలోని బండ్లగూడలో అత్యధికంగా 21.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వనస్థలిపురంలో 19.2, హస్తినాపురంలో 19 సెంటీమీటర్లు కురవగా.. భవానీనగర్ లో 17.9, హయత్ నగర్ లో 17.1 సెంటీమీటర్లు కురిసింది. రామంతాపూర్ లో 17.1, హబ్సిగూడలో 16.5 సెంటీమీటర్లు, నాగోల్ లో 15.6, ఎల్బీనగర్ లో 14.9 సెంటీమీటర్లు, లింగోజిగూడలో 14.6, ఉప్పల్ మారుతినగర్ లో 13.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షం నీరు ఇళ్లలోకి వస్తుండడంతో కాలనీ వాసులు ఇళ్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.

మరోవైపు.. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ నుంచి పరిసర ప్రాంతాల మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో గురువారం కూడా రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, నిర్మల్‌ జిల్లాలతో పాటు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heavy rains  IMD Red Alert  Hyderabad rains  Emergency services  GHMC numbers  Hyderabad  Telangana  

Other Articles