woman held for cheating in the name of god ‘‘మీ సమస్యను ప్రార్థనతో దూరం చేస్తా.. దేవుడితో మాట్లాడతా’’

Woman held for cheating and looting lakhs in the name of god in kukatpally

Sanjana, Cheating, God, blessed disciple, young woman, Gokul Flats, VenkatRamana colony, Kukatpally, Hyderabad, Telangana, Crime

A woman in middle years held for cheating young woman and looting lakhs of ruppees from them in the name of god, by assuring them that their problems will be solved by her. Jubilee hills police arrested a woman Sanjana from Gokul Flats area of VenkataRamana Colony in Kukatpally.

‘‘మీ సమస్యను ప్రార్థనతో దూరం చేస్తా.. దేవుడితో మాట్లాడతా’’

Posted: 07/15/2021 04:46 PM IST
Woman held for cheating and looting lakhs in the name of god in kukatpally

‘‘మీకు ఏదైనా సమస్యా.? అయినా ఏం ఫర్వాలేదు.. మీ సమస్యను నేను పరిష్కరిస్తాను.. సమస్యను దూరం చేసేందుకు ప్రార్థన చేస్తాను. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఏకంగా దేవుడితోనే మాట్లాడతాను. నేను దైవదూతను. నన్ను నమ్మండీ మీ సమస్యలను నాకు వదిలేయండీ.. ఇక వాటిని మీరు మర్చిపోండి..’’ అని నోటికి వచ్చిన మాటలను తీయగా వల్లిస్తే.. ఎవరైనా కొంత సమస్య వున్నవారు వారి మాటలకు వారి ట్రాప్ లో పడకమానరు. అలాగే కష్టాల్లో ఉన్న యువతులను నమ్మిస్తూ వారికి శఠగోపం పెట్టిందీ ఓ యాయలాడి.

అమాయక యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని లక్షలాది రూపాయలు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితురాలిని జూబ్లీహిల్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ నిందితురాలు ఏకంగా యాభై ఏళ్లలోనూ యువతులకు టోకరా వేయడం పోలీసులను ఆశ్చర్యపర్చింది. వివరాల్లోకి వెళ్తే... కూకట్‌పల్లి వెంకటరమణ కాలనీ, గోకుల్ ప్లాట్స్లో నివసించే సంజన కొంత కాలంగా అమాయక యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ వారిని కష్టాల నుంచి దూరం చేసేందుకు తాను దేవుడితో మాట్లాడతానని, ప్రార్థనలు చేస్తానని చెప్పి నమ్మించింది.

ఇటీవల ఓ పెళ్లి సంబంధం వచ్చి తప్పిపోయిన సందర్భంగా జూబ్లీహిల్స్‌కు చెందిన యువతి ఆమె ట్రాప్‌లో పడింది. ఈ జీవితాన్ని గాడిలో పెడతానంటూ పలు దఫాలుగా ఆమె దగ్గరి నుంచి రూ.70 లక్షల దాకా వసూలు చేసింది. ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంజన గుట్టురట్టైంది. అమాయక యువతులను బుట్టలో వేసుకుంటూ తన అకౌంట్లోకి డబ్బులు రాబట్టుకుందని తేలింది. దీంతో నిందితురాలిపై పోలీసులు ఐపీసీ సెక్షన్‌ 406, 420, 508 కింద క్రిమినల్‌ కేసులు నమోదు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా నిందితురాలిపై ఓ బాధితురాలు హుమాయన్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయగా అక్కడ మరో కేసు నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles