Dharmapuri Sanjay to join Congress దూకుడు పెంచిన రేవంత్.. కాంగ్రెస్ లోకి సంజయ్..

Dharmapuri sanjay meets tpcc president revanth reddy to join congress

Congress, TPCC President, Dharmapuri Sanjay, Dharmapuri Aravind, D.Srinivas, Revanth Reddy, Nizamabad, Telangana, Crime

Dharmapuri Sanjay, the former mayor of Nizamabad, said on Tuesday that he would soon join the Congress party. He has made these comments after meeting TSPCC Chief Revanth Reddy. "I have been in the governing TRS for the sake of my father D Srinivas," he added. He has alleged that TRS is not a political party at all.

ITEMVIDEOS: దూకుడు పెంచిన రేవంత్.. కాంగ్రెస్ లోకి సంజయ్..

Posted: 07/13/2021 06:53 PM IST
Dharmapuri sanjay meets tpcc president revanth reddy to join congress

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి తన దూకుడును కూడా పెంచారు. గత ఏడేళ్లుగా వలసలు పోయిన కాంగ్రెస్ నేతలతో పాటు ఇతర పార్టీకి చెందిన నేతలను కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆకర్షించేందుకు సిద్దమయ్యారు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంది. టీఆరఎస్ నేతలతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ పిసిసీ ప్రెసిడెంట్ రేవంత్ ను మర్యాదపూర్వకంగా కలిసేందుకు వచ్చిన నేతలు త్వరలోనే రేవంత్ నాయకత్వాన్ని బలపరుస్తూ నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పడం గమనార్హం.

కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్న వారిలో నిజామాబాద్ బీజేపి ఎంపీ ధర్మపురి సంజయ్ సోదరుడు, డి శ్రీనివాస్ జేష్టపుత్రుడు, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ కూడా ఉన్నారు. సంజయ్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, భూపాలపల్లి బీజేపీ నేత గండ్ర సత్యనారాయణ కూడా కాంగ్రెస్ లో చేరనున్నారు. దీనిపై ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ, తాను కాంగ్రెస్ లోనే పుట్టి పెరిగానని, తండ్రి ధర్మపురి శ్రీనివాస్ కోసమే టీఆర్ఎస్ లో చేరానని, ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ లోకి వస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో చేరతానని వివరించారు.

అటు, మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న ఎర్ర శేఖర్ ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గండ్ర సత్యనారాయణ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్ష పదవిలోకి వచ్చాక రేవంత్ రెడ్డి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. ఇతర పార్టీల్లోని అసంతృప్తులను ఆకర్షించడంలో సఫలమవుతున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి. రేవంత్ కు టీపీసీసీ పగ్గాలు అప్పగించడంతో కాంగ్రెస్ పుంజుకోవడంపై అంచనాలు బలపడుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles