India's first Covid patient tests positive again తొలి కరోనా రొగికి మళ్లీ పాజిటివ్

India s first covid patient tests positive again for coronavirus

Thrissur Medico, China, Thrissur Medical College Hospital, thrissur dmo, rt-pcr result, RT-PCR, Anitgen test, India first covid patient, COVID-19 cases, Covid-19, Coronavirus, corona second wave, corona delta variant, corona vaccine, covaxin, covishield, New Delhi, Kerala

A woman medico, who was India's first Covid-19 case, has tested positive again for the virus, health authorities said here. "She is reinfected with Covid-19. Her RT-PCR is positive, antigen is negative. She is asymptomatic," Thrissur DMO Dr K J Reena told. Her samples were tested as she was prepared to go to New Delhi for study purposes.

భారత తొలి కరోనా పేషెంట్ కు మళ్లీ సోకిన మహమ్మారి

Posted: 07/13/2021 07:29 PM IST
India s first covid patient tests positive again for coronavirus

భారత్ లో క‌రోనావైరస్ సోకిన తొలి పేషెంట్ మరోమారు మహమ్మారి బారిన పడింది. ఏడాదిన్నర కాలం తరువాత మరోమారు అమె కరోనా వైరస్ బారిన పడింది. చైనాలోని మెడిక‌ల్ కాలేజ్‌లో చ‌దువుతున్న కేర‌ళ‌లోని త్రిసూర్ కు చెందిన విద్యార్థిని.. అక్కడ అత్యైక పరిస్థితులు నెలకోనడంతో భారత్ కు తిరిగి వచ్చింది. భారత్ కు చేరుకున్న తరువాత అమె కరోనా మహమ్మారిన పడింది. సరిగ్గా జనవరి 30 2020న అమె కరోనా బారిన పడింది. దీంతో అమె దేశంలో తొలి క‌రోనా పేషెంట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే.

ప్రస్తుతం అమె మరోమారు కరోనా మహమ్మారి బారిన పడింది. అయితే అమెలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తన విద్యాను కొనసాగించేందుకు  న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న అమె తాజాగా కరోనా పరీక్షలు చేయించుకుంది. అయితే అమెకు తొలుతు వైద్యులు యాంటీజెన్ టెస్టు నిర్వహించగా ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో మరోమారు వైద్యాధికారులు అమెకు ఆర్టీ పీసీఆర్ టెస్టు నిర్వహించగా అందులో పాజిటివ్ గా తేలింది. అమెకు లక్షణాలు లేని కరోనా సోకిందని నిర్థారించిన వైద్యులు అమెకు చికిత్స అందించారు. అయితే తాను ఇంట్లోనే ఐసోలేట్ అవుతానని చెప్పడంతో వైద్యులు అమెకు మెడిసిన్ ఇచ్చారు.

కాగా ఆమె ఇప్ప‌టికే క‌రోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న‌ట్లు చెప్పారు. గత ఏడాది 30 జనవరి 2020 ఆమెకు క‌రోనా సోకింది. దీంతో ఇరవై రోజుల పాటు త్రిస్పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో వైద్యులు చికిత్స అందించారు. రెండు పర్యాయాలు అమెకు పరీక్షలు నిర్వహించిన తరువాత అమెకు నెగిటివ్ నివేదిక వచ్చిన తరువాత 20 ఫిబ్రవరి 2020న అమెను వైద్యాధికారులు అసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ త‌ర్వాత ఆమెతోపాటు వుహాన్‌కు వెళ్లిన మ‌రో ఇద్ద‌రు స్నేహితురాళ్ల‌కు కూడా పాజిటివ్ గా తేలింది. వారికి కూడా వైద్యాధికారులు చికిత్స అందించడంతో వారు కరోనా నుంచి బయటపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles