Corona infection cases begin to spike in Maharashtra మహారాష్ట్రలో థర్డ్ వేవ్ స్టార్ అయ్యిందా.? కోల్హాపూర్ కేసులే సంకేతాలా.?

Third wave erupts in maharashtra kolhapur corona infection cases begin to spike

maharashtra third wave, maha spike, spike in corona cases, corona third wave, coronavirus, third wave corona, maharashtra news, maharashtra third wave covid 19, pandemic, kolhapur maharashtra, kolhapur third wave, maharashtra, Crime

The infection in Maharashtra is once again on the rise. In fact, in the first 11 days of this month, July, 88,130 new corona cases have been reported in Maharashtra. In view of this, experts say, "This spurt in corona virus cases could be the third wave as the virus in Maharashtra has shown similar signals in the last two waves."

మహారాష్ట్రలో థర్డ్ వేవ్ స్టార్ అయ్యిందా.? కోల్హాపూర్ కేసులే సంకేతాలా.?

Posted: 07/13/2021 05:57 PM IST
Third wave erupts in maharashtra kolhapur corona infection cases begin to spike

దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆరోగ్యశాఖ అధికారులు కాసింత ఊపిరి పీల్చుకుందామని అనుకుంటున్న సమయంలో థర్డ్ వేవ్ వస్తుందన్న అందోళనలు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. ఈ క్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇప్పటికే దేశ ప్రజలకు పర్యాటక ప్రాంతాలకు, పుణ్యక్షేత్రాలను సందర్శించడాన్ని ఆపాలని కోరింది. ప్రజలు మరింత అప్రమత్తంగా వుండాల్సిన సమయం అసన్నమైనందని హెచ్చరించింది. ఇలా హెచ్చరికలు జారీ చేయడానికి దేశంలో నమోదవుతున్న కరోనా కేసులే కారణంగా నిలుస్తున్నాయి.

అయితే తొలి, రెండవ దశకు కారణంగా మారిన మహారాష్ట్రే ఈ మూడవ వేవ్ కు కూడా కారణంగా మారిందన్న వార్తలు ఇప్పటికే వినబడుతున్నాయి. సెకండ్‌ వేవ్‌ తగ్గిందని అనుకుంటున్న సమయంలో మహారాష్ట్రలో మూడోవ వేవ్ పడగ విప్పుతోందా.? అన్న అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ రాష్ట్రంలో గత 10 రోజుల్లోనే ఏకంగా 79,595 మంది కరోనా బారిన పడ్డగా..ఒక్క కొల్హాపూర్ లోనే 3,000 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో కొల్హాపూర్ లో కరోనా ఆందోళన కలిగిస్తోంది. కరోనా రెండో వేవ్‌ ప్రారంభమై దాదాపు 6 నెలలు కావొస్తున్న క్రమంలో మరోసారి కేసులు పెరుగుతుండటంతో ఆందోళన పెరుగుతోంది.

రెండవ దశ విజృంభన సమయానికి ముందు ఇదే తరహాలో మహారాష్ట్రలో కేసులు సంఖ్య పెరిగాయని, అయితే దానిని తొలి దశ విజృంభనగా భావించగా, అది రెండో దశకు తెరతీసిందని వైద్యఆరోగ్య నిపుణులు పేర్కోంటున్నారు. ఇక తాజాగా రెండో దశ ముగుస్తుందన్న సమయంలో కోల్హాపూర్ జిల్లాలో కేసుల సంఖ్య పెరగడంతో ఇది మూడవ దశకు దారితీస్తోందా.? అన్న అనుమానాలను కూడా వారు వ్యక్తం చేస్తున్నారు, ఇక పెరుగుతున్న కరోనా బాధితుల సంఖ్య ప్రభుత్వాన్ని అందోళనకు గురిచేస్తోంది. అంతేకాదు దేశంలో కరోనా మరణాలు కూడా పెరుగుతుండటంతో సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదని తెలుస్తోంది. దీనికి నిదర్శనంగా..కొత్తగా 2020మంది బలికావటమే. కొన్ని రోజులుగా 1000లోపే మరణాలు ఉండేవి. కానీ కొన్ని రోజుల నుంచి కరోనా మరణాలు పెరుగుతున్నాయి.

మహారాష్ట్రలో వ్యాక్సినేషన్‌ డ్రైవ్స్ కొనసాగుతోంది. అయినా సరే రాష్ట్రంలోని కొల్హాపూర్‌ జిల్లాలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొల్హాపూర్‌లో అత్యధిక వాక్సినేషన్‌ జరిగినప్పటికీ కేసులు ఎందుకు తగ్గడం లేదో అర్థం కావడం లేదని సీనియర్ డాక్టర్లు సైతం అందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలోని మరో 8 జిల్లాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోకపోతే సెకండ్ వేవ్ లో కేసులు తగ్గకపోగా..దీనికి తోడు థర్డ్ వేవ్‌ కూడా జత కలిస్తే పరిస్థితి ఏమవుతుందోననే ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

గడిచిన 11 రోజుల్లో మహారాష్ట్రలో 83,130 పాజిటివ్ కేసులు నమోదు కావటంతో ఈ కేసుల నమోదు చూస్తుంటే థర్డ్ వేవ్ కు సంకేతమేమో ననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రలోనే కాకుండా కేరళలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, కేరళ రాష్ట్రల్లోని కేసులు దాదాపు 53 శాతం ఉన్నాయి. కరోనా రెండో వేవ్‌లో ఢిల్లీలో ఒకప్పుడు 25 వేల కేసుల వరకు పెరిగిపోయాయి. జులై 11న సోమవారం ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 4,32,778 యాక్టివ్ కేసులు నమోదు కాగా..40,68,862 టీకాలు వేశారు. అలాగే మరణాల సంఖ్య 2020గా నమోదు అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : third wave  coronavirus  covid-19  spike in cases  kolhapur  maharashtra  kerala cirme  

Other Articles