Farmer well goes missing in Belagavi of Karnataka తన పోలంలో బావి అదృశ్యమైందని రైతు పిర్యాదు..!

Well goes missing in belagavi of karnataka farmer files police complaint

Farmer well missing, mallappa kulagude well missing, well missing Mavinahonda village, well missing Bhendawada Gram Panchayat, well missing Raigad Taluk, well missing Belgaum, farmer well missing in Karnataka, Farmer, mallappa kulagude, Mavinahonda village, well missing, Police, Raigad Taluk, Belgaum, Karnataka,viral News, Crime

In a Bizarre Incident a well goes missing in Mavinahonda village of Bhendawada Gram Panchayat in Belagavi district of Karnataka. Farmer files police complaint

తన పోలంలో బావి అదృశ్యమైందని రైతు పిర్యాదు.. డొంక కదిలింది..!

Posted: 07/07/2021 01:17 PM IST
Well goes missing in belagavi of karnataka farmer files police complaint

రాజుగారి చేపల చెరువు చిత్రం గుర్తుందా..? సరిగ్గా ఆ చిత్రం తరహాలోనే అధికారులు వ్యవహరించారు. అమ్యామాల మత్తులో అధికారులు ఎంతటి ఘనకార్యానికైనా సిద్దపడతారన్న విషయం మరోమారు రుజవైంది. తన పోలంలో బావి తొవ్విన విషయం.. అందుకు గాను ప్రభుత్వం వద్ద నుంచి తీసుకున్న రుణం గురించి కూడా ఏ మాత్రం తెలియని రైతు.. తీరా డబ్బు చెల్లించాలంటూ నోటీసులు అందుకుని విస్తుపోయాడు. దీంతో రైతు కూడా రాజు గారి చేపల చెరువు చిత్రంలో కథనాయకుడు అనుసరించిన వ్యూహాన్నే అనుసరించి అధికారుల ఆటకట్టించాడు.

నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి తన పొలంలోని బావి అకస్మాత్తుగా అదృశ్యమైందని, వెతికి పెట్టాలని కోరుతూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలోని రాయ్ గభా తాలూకాలోని భెందవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని మావినహోండా గ్రామంలో జరిగిందీ ఘటన. మల్లప్ప కులగుడే అనే రైతు నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి తన బావి కనిపించడం లేదంటూ ఫిర్యాదుచేశాడు. బావి కనబడకుండా పోవడం ఏంటని షాక్ తిన్న పోలీసులు ఆరా తీయగా అధికారుల అవినీతి భాగోతం డొంక కదిలింది. అసలు విషయం బయటపడింది.

అసలు విషయంలోకి ఎంట్రీ ఇస్తే.. గ్రామంలో మలప్ప అనే పేరుకు ఈ అవినీతికి కారణమైందని తెలుస్తోంది. తమ వంశపారంపర్యంగా పలు భూములు, పంటలతో సస్యశ్యామలంగా బతికిన మల్లప్ప రామప్ప కలగుడే అనే గ్రామపెద్ద పేరున ప్రస్తుతం ఒక్క సెంటు భూమి కూడా లేదు. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం డబ్బుపై మాత్రం అతని కన్నుపడింది. దానిని స్వాహా చేయడానికి గ్రామంలోని తన పేరుతో వున్న మరో రైతును ఎంచుకుని వారి పేరున బావి తొవ్వడానికి రూ.77 వేలు రుణం తీసుకున్నారు. అయితే వాయిదాలు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు అందించారు.

నోటీసులు అందుకున్న మల్లప్ప కలగుడే షాక్ తిన్నాడు. తన పొలం గ్రామ సర్వేనెంబరు 21/1 లో బావిని తవ్వినట్టు పంచాయతీ అధికారులు రికార్డులు సృష్టించడంపై విస్తపోయాడు. అయితే సంయమనం పాటించిన రైతు.. కూడా తాను ఎవరికీ వ్యతిరేకంగా వెళ్లినా తాను ఇరుక్కుంటానని భావించి.. తన భూమిలో తొవ్విన బావి కనిపించడం లేదని పిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇక చేసేది లేక రైతు నేరుగా పోలిస్ స్టేషన్ కు వెళ్లి తన భూమిలోని భావి అదృశ్యమైందని పోలీసులకు పిర్యాదు చేశాడు. తొలుత విస్తుపోయిన పోలీసులు అరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Farmer  mallappa kulagude  Mavinahonda village  well missing  Police  Raigad Taluk  Belgaum  Karnataka  viral News  Crime  

Other Articles