Judge Exits Case, Fines Mamata Banerjee Rs 5 Lakh మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా విధించిన కొల్ కతా హైకోర్టు

Mamata banerjee fined 5 lakh for seeking recusal of calcutta hc judge

Mamata Banerjee, Rs 5 Lakh, Fine, painting the judiciary, Justice Kaushik Chanda, Nandigram plea, personal discretion, Calcutta high court, West Bengal, Politics

Justice Kaushik Chanda of the Calcutta high court decided to step away from the case on his own personal discretion, after imposing a 'cost' of ₹5 lakh on West Bengal chief minister Mamata Banerjee for painting the judiciary "in a bad light" by raising such allegations.

మమతా బెనర్జీకి రూ.5 లక్షల జరిమానా విధించిన కొల్ కతా హైకోర్టు

Posted: 07/07/2021 12:15 PM IST
Mamata banerjee fined 5 lakh for seeking recusal of calcutta hc judge

ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి కోల్‌క‌తా హైకోర్టు షాక్ ఇచ్చింది. అమె హైకోర్టు న్యాయమూర్తిపై చేసిన అరోపణలకు గాను రాష్ట్రోన్నత న్యాయస్థానం ముఖ్యమంత్రికి రూ. 5 ల‌క్ష‌ల జ‌రిమానా విధించారు. నందిగ్రామ్ ఎన్నికల పిటీషన్ ను విచారణ నేపథ్యంలో భాగంగా ఈ మేరకు అదేశాలు జారీ చేసిన న్యాయమూర్తి జ‌స్టిస్ కౌశిక్ చందా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనపై అరోపణలు వచ్చిన నేపథ్యంలో తాను ఈ కేసు విచారణ నుంచి వ్యక్తిగత కారణాలతో తప్పుకుంటున్నానని తెలిపారు.

బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి గెలుపును స‌వాల్ చేస్తూ మ‌మ‌తా బెన‌ర్జీ కోర్టులో పిటిష‌న్ వేశారు. అయితే ఆ కేసును జ‌డ్జి కౌశిక్ త‌ప్పుకోవాల‌ని మ‌మ‌తా కోరారు. దీంతో ఆ కేసుపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అయ్యాయి. అయితే ఆ కేసును విడిచిపెట్టే ముందు ఆయ‌న మ‌మ‌తా బెన‌ర్జీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ‌బ‌ద్ద‌మైన విధుల‌ను ఆమె ఉల్లంఘించిన‌ట్లు జ‌డ్జి పేర్కొన్నారు. జ‌స్టిస్ చందాకు బీజేపీ నేత‌తో లింకులు ఉన్నాయ‌ని, అందుకే త‌న కేసును మరో కోర్టుకు బ‌దిలీ చేయాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ కోరారు. కోల్‌క‌తా హైకోర్టు న్యాయ‌మూర్తికి రాసిన లేఖ‌లో ఆమె ఈ అభ్య‌ర్థ‌న చేశారు.  

ఈ కేసును తన బెంచి నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయమూర్తి వ్యవస్థకు కళంకం తీసుకువచ్చేలా అరోపణలు చేయడం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముందస్తు ప్రణాళికలో భాగంగా చె్ప్పుకోచ్చారు. తనకు బీజేపితో సంబంధాలు వున్నాయన్న అనుమానాల నేపథ్యంలో కేసు విచారణ ట్రయల్ పిరీయడ్ అంతా ఇలాగే నడిపించలేమని చెప్పారు. ట్రయల్ పిరీయడ్ మొత్తం పూర్తిగా ఇలాంటి వారు ఈ తరహా అరోపణలు చేస్తూ.. వారు చేసిన అరోపణలను సజీవంగా ఉంచేందుకు ప్రయత్నం చేస్తారని అన్నారు. దీని ప్రభావం కేసు విచారణతో పాటు న్యాయమూర్తి కుర్చికి, న్యాయవ్యవస్థలకు అపవాదం తీసుకువస్తుందని న్యాయమూర్తి అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles