Police deny arresting man with terror links in Bodhan నిజామాబాద్ బోధన్ లో ఉగ్రవాది అరెస్టు

Counter intelligence sleuths arrests a man with terror links in nizambad

Bhodan, Terrorist, arrest, Saudi ariabia, counter intelligence, Police Commissioner Karthikeya, Nizamabad, Crime

Nizamabad Police Commissioner Karthikeya denied reports from the media that police arrested a person, who had links with terrorist organisations, in Bodhan. He clarified that neither the local police nor any other wings of the law enforcement arrested any such person belonging to Bodhan.

నిజామాబాద్లో ఉగ్రవాదికి అరదండాలు.. అయోమయంలో జిల్లా యంత్రాంగం..

Posted: 07/07/2021 02:54 PM IST
Counter intelligence sleuths arrests a man with terror links in nizambad

నిజామాబాద్ జిల్లాలో ఓ ఉగ్రవాది అరెస్ట్ అయ్యాడు. కౌంటర్ ఇంటెలిజెన్స్ కు చెందిన అధికారులు ఈ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. అయినా ఈ విషయం మాత్రం జిల్లా పోలీసులకు ఇప్పటికీ తెలియలేదు.దేశం కానీ దేశాలకు జీవనోపాధి కోసం వలస వెళ్లిన కొందరు అక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడుతున్నారన్న విషయం జిల్లాలోని పోలీసు యంత్రాంగానికి తెలియకపోవడం గమనార్హం. దీంతో విదేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి ఆదేశ పోలీసులకు చిక్కి.. అరెస్టైన నేరస్థులు ఏమీ తెలియదన్నట్లు తిరిగి స్వదేశానికి వచ్చి ఎంచక్కా వచ్చేస్తున్నారు.

పాత పరిచయాల నేపథ్యంలో స్వదేశానికి తిరిగివచ్చిన ఉగ్రవాదులు.. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు.? ఏ వ్యవహరాలు చేస్తున్నారు.? ఏమైనా సంఘవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారా.? ఉగ్రవాద చర్యలకు ఊతంగా నిలుస్తున్నారా.? అన్న విషయాలపై నిఘా కరువవుతోంది. దీంతో దేశంలో ఉగ్రవాదుల కార్యకలాపాలకు పాల్పడే వారి సంఖ్య నానాటికే పెరుగుతోంది. సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ పట్టుపడి ఏడాదిన్న కాలం జైలు శిక్ష అనుభవించిన నిజామాబాద్ జిల్లాకు చెందిన యువకుడు ఆ దేశ క్షమాభిక్ష పెట్టడంతో శిక్షాకాలం పూర్తికాకుండానే విడుదలై స్వదేశానికి చేరుకున్నాడు.

అతడు కనిపించకపోవడంతో భారత రాయబార కార్యాలయం ద్వారా అతడి ఆచూకీని గుర్తించి ఇంటెలిజెన్స్ బ్యూరోకు సమాచారం ఇచ్చారు. వారు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. రంగంలోకి దిగిన దిగిన హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందం నిజామాబాద్ జిల్లా బోధన్ రెంజల్ బేస్‌ లో ఉన్న యువకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కాగా, కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నట్టు తమకైతే ఎలాంటి సమాచారం లేదని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ స్పష్టం చేశారు.  

నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన 35 ఏళ్ల వ్యక్తిని హైదరాబాద్ కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నా జిల్లా పోలీసులకు మాత్రం ఎలాంటి సమాచారం లేకపోవడం కలకలం రేపింది. యువకుడిని అదుపులోకి తీసుకున్న విషయాన్ని పోలీసులు ఇప్పటి వరకు ధ్రువీకరించనప్పటికీ, స్థానికులు మాత్రం అతడిని క్రితం రోజునే పోలీసులు తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. గతంలో సౌదీ అరేబియా వెళ్లిన యువకుడు అక్కడ పాకిస్థాన్ యువకుడితో కలిసి ఆ దేశం తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఇద్దరూ ఏడాదిన్నరపాటు జైలు శిక్ష అనుభవించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన యువకుడు భారత్‌కు అక్రమంగా తిరిగి వచ్చినట్టు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles