Oil India Recruitment 2021: 120 junior assistant posts ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.!

Oil india recruitment 2021 apply for 120 junior assistant posts

oil india recruitment, Oil India Limited, oil-india.com, oil india, hiring, oil india recruitment, sarkari naukrim government jobs, Junior Assistant jobs. oil India limited Junior assistant jobs

Oil India Limited (OIL) is hiring and has invited applications for the various posts of Junior Assistant. Eligible candidates can apply directly on the official website of Oil India at www.oil-ndia.com.

ఆయిల్ ఇండియా లిమిటెడ్ లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు.!

Posted: 07/06/2021 03:52 PM IST
Oil india recruitment 2021 apply for 120 junior assistant posts

భారత ప్రభుత్వ రంగ సంస్థ.. భారత నవరత్న సంస్థల్లో ఒక్కటైన ఆయిల్‌ ఇండియా లిమిటెడ్ కంపెనీలో జూనియర్‌ అసిస్టెంట్‌(క్లర్క్‌ కమ్‌ కంప్యూటర్‌ ఆపరేటర్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 120 పోస్టులును భర్తీ చేయనున్న సంస్థ ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను కోరుతుంది.

* మొత్తం పోస్టుల సంఖ్య: 120(ఎస్సీ–08, ఎస్టీ–14, ఓబీసీ–32, ఈడబ్ల్యూఎస్‌–12, అన్‌రిజర్వ్‌డ్‌–54)

* అర్హత:
కనీసం 40శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌(10+2)ఉత్తీర్ణత.
దీంతో పాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్‌ అప్లికేషన్స్‌లో డిప్లొమా సర్టిఫికేట్.
కంపూటర్లలో ఎంఎస్‌ వర్డ్, ఎంఎస్‌ పవర్‌పాయింట్, ఎంఎస్‌ ఎక్స్‌ఎల్ లో పరిజ్ఞానం వుండాలి.

* వయో పరిమితి: 15.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* జీతభత్యం: నెలకు  రూ.26,600 నుంచి రూ.90,000 చెల్లిస్తారు.

* ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
* పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి.
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/అవేర్‌నెస్, ఆయిల్‌ ఇండియాపై ప్రశ్నలకు  20 శాతం మార్కులు కేటాయిస్తారు.
రీజనింగ్, అర్థమేటిక్‌/న్యూమరికల్‌ అండ్‌  మెంటల్‌ ఎబిలిటీకి 20శాతం మార్కులు కేటాయిస్తారు.
డొమైన్‌/సంబంధిత టెక్నికల్‌ నాలెడ్జ్‌(సంబంధిత పోస్టు విద్యార్హతల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి)కు 60శాతం మార్కులు కేటాయిస్తారు.
* ప్రశ్నలు మల్టిఫుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి.
* నెగిటివ్‌ మార్కింగ్‌ లేదు.
* పరీక్ష ఆంగ్లంలో నిర్వహిస్తారు.
* పరీక్షాసమయం రెండు గంటలు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021
 వెబ్‌సైట్‌: https://www.oil-india.com/Current_openNew.aspx

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles