Need more data on ‘vaccine cocktail': AIIMS chief రెండు వాక్సీన్ల మిశ్రమంతో మైరుగైన రోగనిరోధకశక్తి: గులేరియా

Need more data to approve combining 2 covid 19 vaccines aiims chief

COVID-19, Coronavirus, AIIMS Director, Dr Randeep Guleria, Delta Plus COVID Variant, Delta Plus variant, AIIMS director Dr Randeep Guleria, Coronavirus, Covid-19, Covid-19 vaccine, COVID-19 third wave, corona vaccine, National, Health, Medical Emergency

As concerns rise over the possibility of vaccines being ineffective against various and more powerful variants of the coronavirus disease (Covid-19), All India Institute of Medical Sciences (AIIMS) director Dr Randeep Guleria has said that mixing doses of two different vaccines might increase its efficacy against Covid-19.

రెండు వాక్సీన్ల మిశ్రమంతో మైరుగైన రోగనిరోధకశక్తి: గులేరియా

Posted: 06/26/2021 06:31 PM IST
Need more data to approve combining 2 covid 19 vaccines aiims chief

కరోనా మహహ్మారి తన రూపును మార్చుకుని మూడవదశలో దేశప్రజలపై మరింతగా విరుచుకుపడుతుందన్న అందోళనల నేపథ్యంలో దానిని నియంత్రించేందుకు జాగ్రత్త చర్యలు, సోషల్ డిస్కెన్స్, వాక్సీనేషన్ మూడు అత్యంత అవసరమని చెప్పిన ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా.. తాజాగా రెండు వాక్సీన్లు కలిపి తీసుకుంటే మరింత మెరుగైన రోగనిరోధక శక్తి సాధ్యమవుతుందని అన్నారు. కోవిషీల్డ్, కోవాగ్జీన్లను ఒకదానితో ఒకటి కలిపి ఇవ్వడం ద్వారా మరింత మెరుగైన రోగనిరోధక శక్తి సాధ్యమవుతుందన్నారు.

ఈ ప్రక్రియతో అధిక సంఖ్యలో యాంటీబాడీలు తయారవుతాయన్నదానిపై కొంత సమాచారం అందుబాటులో ఉందని, అయితే దీనిపై మరింత సమాచారం అవసరమని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఓ ప్రధాన టీకా, దాన్ని అనుసరిస్తూ ఓ బూస్టర్ డోసు వేసే విధానం అమల్లో ఉందని తెలిపారు. కొత్తగా ఇప్పుడు రెండు వాదనలు వినిపిస్తున్నాయని అన్నారు. కరోనా వ్యాక్సిన్లను ఒకదానితో ఒకటి కలిపి ఇస్తే కాస్త అధికమోతాదులోనే దుష్పరిణామాలు కలగొచ్చన్నది ఒక వాదన అని, ఇమ్యూనిటీ రెట్టింపవుతుందని, యాంటీబాడీలు పుష్కలంగా తయారవుతాయన్నది మరొక వాదన అని గులేరియా వివరించారు.

అయితే ఈ అంశాలను నిర్ధారించేందుకు మరింత డేటా అవసరం అని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఫైజర్, మోడెర్నా, స్పుత్నిక్ వి, జైడస్ కాడిలా వంటి అనేక వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని, వీటిలో ఏ కాంబినేషన్ మెరుగైన ఫలితాలను ఇస్తుందన్నది ఇప్పుడున్న సమాచారంతో చెప్పలేమని అన్నారు. ప్రాథమికంగా కొన్ని అధ్యయనాలను చూస్తే... రెండు రకాల కొవిడ్ వ్యాక్సిన్లను కలిపి ఇవ్వడం కూడా పరిశీలించదగ్గ అంశమని సూచిస్తున్నాయని గులేరియా వెల్లడించారు.

అవసరానికి మించి ఢిల్లీ ప్రభుత్వం 4 రెట్ల ఆక్సిజన్ ను అధికంగా తీసుకుందనడం సరి కాదని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు నియమించిన ఆక్సిజన్ ఆడిట్ సబ్ కమిటీకి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. అది కేవలం మధ్యంతర నివేదికేనని, తుది నివేదిక వచ్చే వరకు ఆగాలని సూచించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, కోర్టు ఏం చెబుతుందో వేచి చూడాలని ఆయన అన్నారు. యాక్టివ్ కేసులను తక్కువగా లెక్కించడం, ఇతర కారణాలను విశ్లేషించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా, బహుశా థర్డ్ వేవ్.. సెకండ్ వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని గులేరియా అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Covid Third wave  AIIMS  Randeep Guleria  Covaxin  Covishield  Delta Plus variant  COVID-19  WHO  Coronavirus  

Other Articles