COVID-19 variant: Lambda to terrorize Americans ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ ‘లాంబ్డా’ వేరియంట్..

Lambda lineage of sars cov 2 has potential to become variant of concern

SARS, SARS-CoV-2, Antibody, Coronavirus, Coronavirus Disease COVID-19, Efficacy, Gene, Hospital, Pandemic, Protein, Receptor, Respiratory, Severe Acute Respiratory, Severe Acute Respiratory Syndrome, Spike Protein, Syndrome, Virus

Researchers have described the first reported infection with the C.37 (Lambda) lineage of severe acute respiratory syndrome coronavirus 2 (SARS-CoV-2) in Southern Brazil. The SARS-CoV-2 virus is the agent responsible for the ongoing coronavirus disease 2019 (COVID-19) pandemic. The Lambda lineage was classified as a variant of interest (VOI) by the World Health Organization on June 15th, 2021.

ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కోవిడ్ ‘లాంబ్డా’ వేరియంట్.. WHO తాజా అదేశాలు..

Posted: 06/28/2021 11:26 AM IST
Lambda lineage of sars cov 2 has potential to become variant of concern

కరోనా వైరస్ నియంత్రణకు ప్రపంచదేశాలు పరిశోధనలు చేసి.. దాని బారి నుంచి మానవాళిని రక్షించేందుకు పలు వ్యాక్సిన్లు రూపోందించి ప్రజలకు అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే కరోనా కూడా తన రూపాన్ని బదలాయించి కొత్త వేరియంట్ల రూపంలో పరిశోధకులకు సవాల్ విసురుతోంది. ప్రపంచ జనాభాకు వ్యాక్సినేషన్ అందించేందుకు ఏళ్ల సమయం పట్టే తరుణంలో కరోనా మాత్రం తన రూపును మార్చుకుని అనేక వేరియంట్లతో దాడి చేస్తూనే వుంది.

ఇప్పటికే ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వేరియంట్ల దాటికి ప్రపంచవ్యాప్తంగా లక్షలాధి మంది అసువులు బాసారు. కొట్ల మంది ఈ మహమ్మారి బారిన పడి కొలుకున్నా.. వారిని ఇంకా అనారోగ్య సమస్యలు బాధిస్తూనే వున్నాయి. ఈ క్రమంలో కొత్తగా ‘లాంబ్డా’ అనే వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది. ఈ వేరియంట్ ను ముందుగా తేలికగా తీసుకున్నా.. అనేక దేశాల్లో ఇది విస్తృతంగా విస్తరిస్తోంది. దీంతో లాంబ్డాను కూడా వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్ గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ).

బ్రిటన్‌లోని పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లాండ్‌ (పీహెచ్‌ఈ) కూడా దీన్ని ‘పరిశోధనలో ఉన్న కరోనా వేరియంట్‌’గా వర్గీకరించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం.. దీని స్పైక్‌ ప్రొటీన్‌లో ఎల్‌452క్యూ, ఎఫ్‌490ఎస్‌ సహా పలు ఉత్పరివర్తనలు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌లో ఇప్పటివరకూ ఆరు లాంబ్డా కేసులు వెలుగు చూశాయి. ముందుగా ఇది గతేడాది ఆగస్టులో పెరూలో కనిపించింది. ఆ తర్వాత చిలీ, ఈక్వెడార్‌, అర్జెంటీనా సహా 29 దేశాలకు విస్తరించింది. ఏప్రిల్‌ నుంచి పెరూలో బయటపడిన కోవిడ్‌ కేసుల్లో ఈ వేరియంట్‌ వాటా 81 శాతం మేర ఉండటం గమనార్హం.

 60 రోజులుగా చిలీలో 32 శాతానికి పెరిగింది. ఈ వేరియంట్‌ వల్ల తీవ్ర ఇన్ఫెక్షన్‌ వస్తుందనడానికి గానీ, ప్రస్తుత టీకాలను ఇది ఏమారుస్తుందనడానికి గానీ ఇప్పటివరకూ ఎలాంటి ఆధారాలు లేవని పీహెచ్‌ఈ పేర్కొంది. దీని స్పైక్‌ ప్రొటీన్ లోని ఉత్పరివర్తనల వల్ల వ్యాప్తి ఎలా ఉండబోతుందనేది.. మెరుగ్గా అర్థం చేసుకోవడానికి ల్యాబ్ లల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పీహెచ్‌ఈ వివరించింది. కరోనా సోకిన వ్యక్తి వుండే లక్షణాలు ఈ వేరియంట్ సోకిన వ్యక్తికి వుంటే లక్షణాలు ఒక్కటేనని తేల్చారు. అధిక ఉష్ణోగ్రత, ఆగకుండా దగ్గు, వాసన లేదా రుచి కోల్పోవడం ఈ వేరియంట్ ముఖ్యలక్షణాలని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  COVID-19  Lambda variant  delta plus variant  Pandemic  SARS-CoV-2  Spike Protein  Syndrome  Virus  

Other Articles