Former PM ordered to pay ₹2 crore in defamation case పరువునష్టం కేసులో మాజీ ప్రధానికి రూ.2 కోట్ల జరిమానా

Hd deve gowda asked to pay 2 crore damages in defamation case by infra firm

H D Deve Gowda, former prime minister, Janata Dal (Secular), JD(S), NICE, Bengaluru, Nandi Infrastructure Corridor Enterprise Limited, defamatory comments, allegation, project, ₹2 crore, damages, H D Deve Gowda, Nandi Infrastructure Corridor Enterprises, NICE, defamation case, Bengaluru court, Karnataka, Politics

A Bengaluru court has asked former Prime Minister H D Deve Gowda to pay 2 crore in damages to Nandi Infrastructure Corridor Enterprise Limited (NICE) in connection with a defamation case against him for statements he made in a television interview in 2011.

దశాబ్దం నాటి పరువునష్టం కేసులో.. మాజీ ప్రధానికి రూ.2 కోట్ల జరిమానా

Posted: 06/22/2021 02:53 PM IST
Hd deve gowda asked to pay 2 crore damages in defamation case by infra firm

మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు కోర్టు భారీ జరిమానా విధించింది. దశాబ్ద కాలం కిత్రం బూట్ విధానంలో నిర్మితమవతున్న బెంగళూరు-మైసూరు హైవే కారిడార్ పై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన పరువు నష్టం కేసులో రూ.2కోట్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. అంతేకాదు ఇకపై ఈ విషయంలో ఆయన సదరు కంపెనీపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని, స్టేట్ మెంట్లు కూడా ఇవ్వరాదని న్యాయస్థానం ఆంక్షలను విధించింది. ఈ నేపథ్యంలో సంస్ధకు జరిగిన పరువు నష్టంపై వారికి పరిహార రుసుమును చెల్లించాలని అదేశించింది.

2011 జూన్‌ 28న ‘గౌడర గర్జన’ పేరుతో సువర్ణ కన్నడ న్యూస్ ఛానల్ లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో బెంగళూరు-మైసూరు ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ నిర్మిస్తున్న నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజ్‌(ఎన్‌ఐసీఈ) ప్రాజెక్టుపై దేవెగౌడ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. స్వయంగా నిర్మించి నిర్వహించి బదిలీ చేసే పద్దతి (బిల్డ్ ఓన్ ఆపరేట్ ట్రాన్స్ ఫర్ పద్దతి) బూట్ పద్దతిలో నిర్మించిన ఈ కారిడార్ ను ఆయన లూట్ కారిడార్ గా అభివర్ణించారు. ప్రజాధనాన్ని ఎన్ఐసిఈ కంపెనీ లూటీ చేస్తోందని అరోపించారు. అంతటితో ఆగకుండా సంస్థ ప్రమోటర్, మెనేజింగ్ డైరెక్టర్ అశోక్ ఖెనీపై కూడా పలు అరోపణలు చేశారు.

అశోక్ ఖెనీ ఓ ల్యాండ్ మాఫియా అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యాఖ్యలతో తమ పరువుకు భంగం వాటిల్లిందంటూ దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన బెంగళూరు సెషన్స్‌ కోర్టు.. ఎన్‌ఐసీఈ ఆరోపణల్లో నిజం ఉందని తేల్చింది. ఎన్‌ఐసీఈ ప్రాజెక్టును గతంలో కర్ణాటక హైకోర్టు, సుప్రీంకోర్టు తమ తీర్పుల్లో సమర్థించాయని న్యాయస్థానం గుర్తుచేసింది. ఇది కర్ణాటక ప్రజల ప్రయోజనాల కోసం కంపెనీ చేపట్టిన పెద్ద ప్రాజెక్టు అని తెలిపింది. అలాంటి ప్రాజెక్టుపై పరువు నష్టం వ్యాఖ్యలను అనుమతిస్తే ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టు ఆలస్యమవుతుందని అభిప్రాయపడింది. కంపెనీ పరువుకు భంగం కలిగించినందుకు గానూ ఎన్‌ఐసీఈకి దేవెగౌడ రూ. 2 కోట్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles