Groom in UP ride bullock cart to wedding venue పెట్రోల్ ధరలు పైపైకి.. ధశాబ్దాల వెనక్కి ప్రగతి.. ఎడ్లబండిపై వరుడు..

Petrol price impact groom in up ride bullock cart to wedding venue

petrol price impact, Dulha on bullock cart, bridegroom baraat, funny indian wedding videos, baarat, bullock cart, Chhote Lal Pal, Deoria, groom, marriage, marriage procession, Uttar Pradesh, Wedding, Viral news, viral video, wedding videos, indian wedding videos

A video is doing the rounds on social media where a marriage procession in Uttar Pradesh was taken out on bullock carts. In Uttar Pradesh’s Deoria, the groom and the ‘baraatis’ rode on bullock carts to reach the wedding venue in Pakri Bazar from his house in Kushari village, a distance of 35 km.

ITEMVIDEOS: పెట్రోల్ ధరలు పైపైకి.. ధశాబ్దాల వెనక్కి ప్రగతి.. ఎడ్లబండిపై వరుడు..

Posted: 06/22/2021 01:00 PM IST
Petrol price impact groom in up ride bullock cart to wedding venue

పెట్రోల్, డీజిల్ రేట్లు భగ్గుమంటున్నాయి.. గతేడాది కరోనా లాక్ డౌన్ తరువాత అన్ లాక్ తో దేశవ్యాప్తంగా అన్ని తెరుచుకున్న క్రమంలో పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధరలు అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఏకంగా ఇంధన ధరలపై 30 రూపాయలను మేర పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు 100 ధాటింది. అదే స్థాయిలో డీజిల్ ధర కూడా పలు రాష్ట్రాల్లో వంద రూపాయల మేర దాటింది. దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతూన్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలపై సోషల్ మీడియా వేదికగా అనే వార్తలు, జోకులు వైరల్ అవుతున్నాయి.

పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపినా పెడచెవిన పెట్టిన కేంద్రం ధరల పెంపును కొనసాగిస్తూనే వుంది. దీంతో ఇంధన ధరల పెంపుపై సామాన్యులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకు నిరసనగా ఓ పెళ్లి బృందం ఎడ్ల బండ్లపై వివాహ వేదికకు వచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దేవరియా జిల్లా కుషారీ గ్రామానికి చెందిన ఛోటే లాల్‌ తన గ్రామం నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని పక్రీ బజార్ లో పెళ్లి మండపానికి ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చాడు. తన బంధుజనం, కట్న కానుకులతో పాటు ఎడ్లబండ్లపై ఊరేగింపును నిర్వహించాడు.

ఈ సందర్బంగా వరుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు ధరలు భారీగా ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఎడ్లబండ్లపై పెళ్లి వేడుకకు వెళ్తున్నామని తెలిపాడు. కేంద్రం ఇప్పటికైనా ఇంధన ధరల పెంపును తగ్గించాలని కోరాడు. ఇక దీనికి తోడు దశాబ్దాల క్రితం అప్పటి వారు ఇలానే పెళ్లి చేసుకునేవారని.. ఆ విషయం ఇప్పటి తరం ప్రజలకు తెలియదని, దీంతో దానిని వారికి చూపించాలని కూడా ఇదే మన గత సంప్రదాయమని చెప్పాలని ఎడ్లబండిపై వచ్చానని అన్నారు. ఇది తన చిన్ననాటి కోరిక అని దానికనుగూణంగానే ఇప్పుడు చేసుకున్నానని తెలిపాడు. ఇలా వెళ్లడం వలన వాయు కాలుష్యాన్ని తగ్గించ వచ్చని తెలిపారు ఛోటే లాల్‌. ఇక ఈ సంక్షోభ సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles