Exoplanet Found Circling Nearby Red Dwarf భూగ్రహాన్ని పోలిన మరోగ్రహం.. కనుగోన్న నాసా అంతరిక్ష కేంద్రం

Nasa says newly discovered exoplanet could have water clouds and a tail

Nasa, exoplanet, Earth, nasa exoplanet, TOI-1231 b, new exoplanet, exoplanet atmosphere, exoplanet cloud, nasa exoplanet cloud, TOI-1231 b atmosphere, TOI-1231 b cloud, TOI-1231 b tail, NASA news, NASA discovery, NASA latest, NASA earth type planet, NASA space, NASA exploration

Astronomers have discovered an exoplanet located 90 light-years away from Earth with a potentially rich atmosphere that may contain water clouds. Nasa said that the newly discovered exoplanet is more than three-and-a half times as big as Earth, calling it “oddly reminiscent” of Neptune. The exoplanet named TOI-1231 b orbits a red-dwarf star that, according to Nasa, is “smaller but longer-lived” than the Sun.

భూగ్రహాన్ని పోలిన మరోగ్రహం.. కనుగోన్న నాసా అంతరిక్ష కేంద్రం

Posted: 06/12/2021 12:34 PM IST
Nasa says newly discovered exoplanet could have water clouds and a tail

మనిషి తన అవాసయోగ్యమైన స్థలాన్ని వెతకంటో అనునిత్యం బిజీగానే వుంటాడు. ఇప్పటికే ఈ భూమండలంపైనున్న అడువులను కూడా అక్రమించి ఇళ్ల నిర్మాణం చేస్తున్న క్రమంలో అడువుల్లో సంచరించే వన్యమృగాలు జనారాణ్యంలోకి వచ్చి భిక్కుబిక్కుమంటూ సంచరిస్తున్నాయి. అయితే నానాటికీ పెరుగుతున్న జనాబాకు అనుగూణంగా భూమండలమే సరిపోదని ముందుగానే గ్రహించాడో ఏమో అవాసయోగ్యంగా చంద్రుడు ఉన్నాడనగానే అక్కడ కూడా ఫ్లాట్లు కొన్నవాళ్లు వున్నారు. కాగా ఇప్పుడు సూర్యుడి కన్న పూరాతనమైన గ్రహం మానవుల అవాసానికి యోగ్యంగా వుందన్న వార్తలు సంచలనంగా మారాయి.

అనంత విశ్వంలో భూమిని పోలి, జీవం కలిగిన గ్రహాల కోసం పలు దేశాలు అన్వేషణ సాగిస్తూనే వున్నాయి. ఈ అన్వేషణ భాగంగా అమెరికా అంతరిక్ష సంస్థ నాసా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ప్రపంచ దేశాల అంతరిక్ష అద్యయనంలోనూ నాసా అగ్రగామిగా ఉంది. తాజాగా నాసా వ్యవస్థలు ఓ భూమిని పోలిన గ్రహాన్ని గుర్తించాయి. దీనికి టీఓఐ-1231బి అని నాసా శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ గ్రహంపై మేఘాలతో కూడిన వాతావరణం కూడా ఉన్నట్టు గుర్తించారు. మానవుల అవాసానికి యోగ్యమైన వాతావరణం వుందా.? అన్న కోణంలోనూ నాసా అధ్యయనం కొనసాగిస్తోంది.

ఇక్కడ ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 57 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతున్నట్టు తెలుసుకున్నారు. దీని పరిమాణం భూమి కంటే చాలా ఎక్కువని తెలిపారు. అయితే నాసా ఇప్పటివరకు గుర్తించిన కొత్త గ్రహాల్లో ఇదే చిన్నది. ఇది భూమికి 90 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని పేర్కొన్నారు. అయితే ఇది నివాసయోగ్యమా? కాదా? అని తెలుసుకునేందుకు మరికొన్ని పరిశోధనలు అవసరమని నాసా పేర్కొంది. ఈ కొత్త గ్రహాన్ని కనుగొనడంలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబరేటరీ, యూనివర్సిటీ ఆఫ్ న్యూమెక్సికో పరిశోధకులు పాలుపంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles