Mehul Choksi Denied Bail By Dominica Court మెహుల్ చొక్సీ బెయిల్ పిటీషన్ ను తిరస్కరణ

Mehul choksi is international fugitive cbi tells dominica court

Mehul Choksi, PNB Scam, Punjab National Bank scam, Dominica High Court, Roseau magistrate, flight risk, choksi case, Choksi bail denied, dominica, Indian fugitive businessman mehul choksi, flight risk, Choksi, Bail, Mehul Choksi

Mehul Choksi, the fugitive jeweller wanted in India in connection with the ₹13,500 crore Punjab National Bank (PNB) fraud, has been denied bail by the Dominica high court

మెహుల్ చొక్సీ బెయిల్ పిటీషన్ ను తిరస్కరించిన డొమినికా హైకోర్టు

Posted: 06/12/2021 01:21 PM IST
Mehul choksi is international fugitive cbi tells dominica court

భారత దేశ అర్థిక నేరస్థుడు, పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు, ఉద్దేశపూర్వక ఎగవేతదారుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ పెట్టుకున్న బెయిలు పిటిషన్‌ను డొమినికా హైకోర్టు తిరస్కరించింది. భారత్‌ నుంచి పరారైన తర్వాత కరేబియన్ ద్వీసాల్లోని అంటిగ్వాలో ఉంటూ వచ్చిన మెహుల్ చోక్సీ గత నెల 25న అదృశ్యమయ్యాడు. అయితే తాను అదృశ్యం కాలేదని, తనను కిడ్నాప్ చేశారన్ని అరోపించిన ఆయన డొమినికాలో అక్రమంగా చొరబడ్డాడు. దీంతో డొమినికాలో ఇంటర్ పోల్ కు చిక్కాడం అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ఉన్న చోక్సీ  బెయిలు కావాలంటూ పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది.

చోక్సీ మరెక్కడికీ పారిపోరని, అనారోగ్య కారణాలతో బెయిలు మంజూరు చేయాలంటూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అయితే, ‘ఫ్లైట్ రిస్క్’ (విచారణకు ముందే దేశం విడిచి వెళ్లిపోవడం) కారణంగా బెయిలు ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. డొమినికాలో చోక్సీ ఉంటున్నది స్థిరమైన చిరునామా కాదని, ఆయనపై నమోదైన ఆరోపణలపై ఇంకా విచారణ ప్రారంభం కాలేదని గుర్తు చేసింది. దీంతో మెహుల్ చోక్సీకి ఎదురుదబ్బ తగిలింది. ఆయన మేనల్లుడు నిరవ్ మోడీ కూడా లండన్ లో మారువేషంలో తిరుగుతుండగా జర్నలిస్టు ఫోటో తీయడంతో ఆయన అసలు విషయం బయటపడింది. దీంతో అక్కడి పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mehul Choksi  PNB Scam  Punjab National Bank scam  Dominica High Court  Flight Risk  Crime  

Other Articles