loan to SC families who lost earning member ఆర్జించే వ్యక్తిని కోల్పోయిన ఎస్సీ కుటుంబాలకు కేంద్రం అండ

Govt to provide loan to sc families who lost earning member due to covid

covid-19, coronavirus, Covid-19, Covid-19 Pension, National Scheduled Castes Finance and Development Corporation, Scheduled Caste families, insurance benefits, Employees State Insurance Corporation, Narendra Modi, Prime Minister, maximum insurance benefit, Union Ministry

The Central Government announced welfare measures to Shecdule Caste families who have lost their earning members due to the Covid-19. NSFDC it to provide Loans to those families, who lost the earing person due to covid at 20 percent subcidy.

కరోనాతో ఆర్జించే వ్యక్తిని కోల్పోయిన ఎస్సీ కుటుంబాలకు కేంద్రం అండ

Posted: 06/12/2021 11:45 AM IST
Govt to provide loan to sc families who lost earning member due to covid

కరోనా కారణంగా సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీరికి 20 శాతం సబ్సిడీతో రూ. 5 లక్షల వరకు రుణం ఇవ్వడం ద్వారా వారి కుటుంబాలను తిరిగి నిలబెట్టనుంది. ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్ఎస్ఎఫ్‌డీసీ) ద్వారా వీరికి రుణం అందనుంది. అందుకున్న రుణంలో 20 శాతం రాయితీ పోను మిగతా మొత్తాన్ని 6 శాతం వడ్డీతో వాయిదాల్లో బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఇందుకు కొన్ని నిబంధనలు కూడా విధించింది. మరణించిన వ్యక్తి వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షలకు మించకూడదు.

కుటుంబంలో తల్లిదండ్రులు మరణించినా, సంపాదించే వ్యక్తి మరణించినా సాయం లభిస్తుంది. అయితే, కుటుంబ పెద్ద కొవిడ్‌తో మరణించినట్టు ధ్రువీకరణ పత్రం ఉండడంతోపాటు కుటుంబం మొత్తం అతడిపైనే ఆధారపడి ఉండాలి. ఈ మేరకు ఇంటి పెద్దను కోల్పోయిన ఎస్సీ కుటుంబాలను గుర్తించి జాబితా పంపాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను (ఎన్ఎస్ఎఫ్‌డీసీ) కోరింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి బాధిత కుటుంబాల గుర్తింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో అర్హత ఉన్న కుటుంబాలను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గుర్తించాలంటూ ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ఎండీ నవ్య ఆదేశాలు జారీ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  Covid-19  NSFDC  Earning person  SC Families  Subsidised loan  Union Ministry  

Other Articles