auto journey safe in india amid covid-19 కరోనా వేళ.. అటో ప్రయాణమే కాసింత సురక్షితం: అధ్యయనం

Auto journey is safe in india amid coronavirus john hopkins university

John Hopkins University, covid-19, coronavirus, Auto Rickshaws, AC Cars, non AC Cars, Public Transportation systems, environmental studies, Crime

A Study by the John Hopkins University Says there is less possibility of covid-19 virus attack by the journey through Auto Rickshaws than in AC and non AC Cars and Public Transportation systems.

కరోనా వేళ.. అటో ప్రయాణమే కాసింత సురక్షితం: అధ్యయనం

Posted: 06/10/2021 10:38 AM IST
Auto journey is safe in india amid coronavirus john hopkins university

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ డెల్టా వేరియట్ దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అనేక మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి. ఇక ఇప్పుడిప్పుడే కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు అన్ లాక్ చేస్తూ ఆర్థిక వృద్ది సాధించే విషయమై దృష్టి సారించాయి. అయితే ఈ పరిస్థితుల్లోనూ తప్పనిసరి ప్రయాణాలు చేసేవారు ఏ వాహనాల్లో ప్రయాణిస్తే వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. ఏ తరహా వాహనంలో ప్రయాణిస్తే వారికి కరోనా సోకే ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశాలు వున్నాయన్న విషయంపై కాసింత క్లారిటీ వచ్చింది.

తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణాలు చేసేవారు బస్సు, ఏసీ కారు, ఏసీ రహిత కార్లలో ప్రయాణం చేస్తే మంచిదా..? లేక ఆటో ప్రయాణమే సేఫ్ అని ఓ సంస్థ తాజాగా అధ్యయనం చేసింది. కోవిడ్-19 మహమ్మారి వేళ భారత్లో వివిధ రవాణా వాహనాల్లో ప్రయాణ.. ప్రమాద విశ్లేషణ’ పేరుతో అమెరికాలోని జాన్ హాప్ కిన్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. మనం ప్రయాణిస్తున్న వాహనాల్లో తోటి ప్రయాణికుల్లో ఎవరికైనా కరోనా సోకి ఉంటే.. ఆటోలో కంటే ఏసీ కారులో ప్రయాణిస్తున్నప్పుడు వైరస్ మనకు సంక్రమించే ప్రమాదం 300 రెట్లు అధికంగా ఉంటుందని తేలింది. ఆటో, కార్లలో ఐదేసి మందిని, బస్సులో డ్రైవర్ సహా 40 మందిని ఈ అధ్యయనానికి ప్రాతిపదికగా తీసుకున్నారు.

కొవిడ్ రోగితో కలిసి ఆటోలో ప్రయాణించడంతో పోలిస్తే నాన్ ఏసీ కారులో కొవిడ్ రోగితో కలిసి ప్రయాణిస్తే వచ్చే ముప్పు 86 రెట్లు అధికమని, అదే ఏసీ కారులో అయితే ఇది ఏకంగా 300 రెట్లు ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. నాన్ ఏసీ కారులో ప్రయాణిస్తున్నప్పుడు అద్దాలు కిందికి దింపితే ఈ రిస్క్ 250 శాతం తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు. ఆటోలో నలుగురితో కలిసి ప్రయాణించేటప్పుడు కలిగే ముప్పుతో పోలిస్తే ఆగి వున్న బస్సులో కిటికీలన్నీ తెరిచి ఉంచి, అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నప్పుడు వైరస్ ముప్పు 72 రెట్లు అధికంగా ఉంటుందని అధ్యయనంలో వెల్లడైంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు ‘ఎన్విరాన్‌మెంటల్ రీసెర్చ్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles