Hero Ram Charan Adopted Elephant Gajrani passes away రామ్ చరణ్ దత్తత తీసుకున్న గజరాణి కన్నుమూత

Hero ram charan adopted 83 year old elephant gajrani passes away

Mega Power Star Ram Charan, ram charan adopted Elephant, oldest elephant Gajrani, Gajrani passes away, Gajrani ill health, Gajrani old age issues, Gajrani zoo, Gajrani Nehru zoological park, Leopard Ayyappa passes away leopard ayyappa died,

Tollywood Hero Mega Power Star Ram Charan, last year adopted an 83 year old Elephant named Gajrani had passes away today due to ill health and old age issues in the zoo. Nehru zoological park authorities said that an 21 years old Leopard called Ayyappa too died today.

రామ్ చరణ్ దత్తత తీసుకున్న గజరాణి కన్నుమూత

Posted: 06/10/2021 09:42 AM IST
Hero ram charan adopted 83 year old elephant gajrani passes away

హైదరాబాద్‌ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో విషాదం చోటుచేసుకుంది. ఒకే రోజు గజరాజు, చిరుతలు మరణం జూ అధికారులతో పాటు సందర్శకులను విషాదంలోకి నెట్టాయి. జూ పార్కులో అత్యధిక కాలం జీవించిన ఏనుగుగా రికార్డులకెక్కిన ఆడ ఏనుగు ‘గజరాణి’ మృతి చెందింది. గత ఏడాది తెలుగు చలన చిత్రసీమకు చెందిన స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ గజరాణిని దత్తత తీసుకున్నారు. దాని ఆలనాపాలనకయ్యే ఖర్చును తానే భరిస్తానని అప్పుడే జూ పార్కు అధికారులకు హామి ఇచ్చారు. అయితే ఏనుగు వైద్యానికయ్యే ఖర్చును కూడా ఆయననే భరించారు.

83 ఏళ్ల ఈ ఏనుగు వృద్ధాప్య సమస్యలకు తోడు అనారోగ్యంతో బాధపడుతోంది. ఏసియాటిక్ జాతికి చెందిన ఈ ఏనుగు నిజాం కాలం నాటిది. నగరంలో జరిగే సంప్రదాయ కార్యక్రమాలు, ఉత్సవాలు, మొహర్రం, బోనాల ఊరేంగిపులో కొన్నేళ్లపాటు ‘గజరాణి’ పాల్గొంది. సాధారణంగా ఏనుగుల జీవిత కాలం 60 ఏళ్లేనని, కానీ ఇది 83 ఏళ్లు జీవించిందని జూ అధికారులు తెలిపారు. 7 జులై 1938లో జన్మించిన ఈ ఏనుగును గతేడాది జులైలో టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ దత్తత తీసుకున్నారు.

కాగా, వృద్ధాప్య సమస్యలతోనే నిన్న ఇదే జూలో ఓ మగ చిరుత కూడా మృతి చెందింది. దీని వయసు 21 సంవత్సరాలు. 16 జూన్ 2000వ సంవత్సరంలో తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో జన్మించిన ఈ చిరుత పేరు ‘అయ్యప్ప’. చిరుత సంతతి రక్త మార్పిడిలో భాగంగా దీనిని హైదరాబాద్‌కు తరలించారు. చిరుతల జీవిత కాలం 15 ఏళ్లు మాత్రమేనని, అయితే జూలో వాటి సంరక్షణపై తీసుకునే శ్రద్ధ, ఆహారం కారణంగా ‘అయ్యప్ప’ మరో ఆరేళ్లు అధికంగా జీవించిందని అధికారులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Elephant  old age  Gaj rani  leopard  Ayyappa  Ram Charan  adoption  Nehru zooligical park  Hyderabad  

Other Articles