Ghantasala Ratna Kumar dies of cardiac arrest ఘంటసాల తనయుడు రత్నకుమార్ కన్నుమూత

Dubbing artiste ghantasala ratnakumar passes away due to cardiac arrest

ghantasala ratnakumar, ghantasala ratnakumar death, ghantasala ratnakumar dead, ghantasala ratnakumar death news, dubbing artist ghantasala ratnakumar, Ghantasala Venkateshwar rao, dubbing artist, heart attack, KIdney ailment, covid-19, coronavirus,

Ghantasala Ratnakumar, famous dubbing artist and son of legendary music composer Ghantasala Venkateswara Rao, died on Thursday at a private hospital in Chennai after to cardiac arrest. He was diagnosed with Covid-19 earlier but recently tested negative.

గుండెపోటుతో మరణించిన ఘంటసాల తనయుడు రత్నకుమార్

Posted: 06/10/2021 11:12 AM IST
Dubbing artiste ghantasala ratnakumar passes away due to cardiac arrest

డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దిగ్గజ గాయకుడు ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ఈ తెల్లవారుజామున కన్నుమూశారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన కోలుకున్నారు. రెండు రోజల క్రితం నిర్వహించిన పరీక్షల్లో నెగటివ్‌ గా తేలడం గమనార్హం. రత్నకుమార్ కు కిడ్నీ సమస్యలు ఉన్నాయని, డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.

డబ్బంగ్ ఆర్టిస్టుగా రత్నకుమార్ దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్‌లోనూ పలు చిత్రాలకు తన గాత్రాన్ని అందించారు. ఎనిమిది గంటలపాటు ఏకధాటిగా డబ్బింగ్ చెప్పి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ రత్నకుమార్ స్థానం సంపాదించుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఇప్పటి వరకు ఆయన వెయ్యికిపైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. తెలుగులో ‘వీరుడొక్కడే’, ‘ఆట ఆరంభం’ సహా 30కి పైగా సినిమాలకు రత్నకుమార్ మాటలు అందించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles