Complete Nellore Ayurvedic Medicine Efficacy soon: Venkaiah Naidu ఆనందయ్య ఔషధంపై అద్యయనం త్వరగా పూర్తిచేయండి: ఉపరాష్ట్రపతి

Vp venkaiah naidu to ayush complete nellore ayurvedic medicine efficacy soon

ayurveda medicine, coronavirus, covid-19 Ayurvedic medicine, krishnapatnam, Anandaiah, Vice President, Venkaiah Naidu, Ayush, Kiren Rijiju, ICMR, Balram Bhargava, herbal medicine for covid, Indian Council of Medical Research, Krishnapatnam medicine, nellore, herbal preparation

Taking note of the “Krishnapatnam medicine” gaining popularity, Vice-President M. Venkaiah Naidu, asked Union Minister for AYUSH Kiren Rijiju and ICMR Director-General Balram Bhargava to complete the study on the herbal preparation.

ఆనందయ్య ఔషధంపై అద్యయనం త్వరగా పూర్తిచేయండి: ఉపరాష్ట్రపతి

Posted: 05/27/2021 07:12 PM IST
Vp venkaiah naidu to ayush complete nellore ayurvedic medicine efficacy soon

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీపోట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ప్రాంతం రాష్ట్రాల ప్రజల దృష్టినే కాదు యావత్ భారత దేశ ప్రజల దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ అధ్యయనం కొనసాగుతోంది. దీనిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆరా తీశారు. ఆనందయ్య ఔషధంపై జరుగుతున్న అధ్యయనం వివరాలను ఆయన కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవను అడిగి తెలుసుకున్నారు.

తొలుత కిరణ్ రిజిజుకు ఫోన్ చేసిన ఆయన... వీలైనంత త్వరగా అధ్యయనం పూర్తిచేయాలని సూచించారు. అందుకు కిరణ్ రిజిజు బదులిస్తూ... మంత్రాలయంలోని ఆయుష్ శాఖకు చెందిన సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్ఏఎస్) ఆధ్వర్యంలో ఆనందయ్య మందుపై అధ్యయనం జరుగుతోందని వెంకయ్యనాయుడికి తెలిపారు. ఆనందయ్య మందు వాడిన 500 మంది నుంచి సేకరించిన సమాచారాన్ని ఈ అధ్యయనంలో వినియోగిస్తున్నారని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు. ప్రజలకు సంబంధించిన ఎంతో ప్రాధాన్యత ఉన్న అంశం కావడంతో, లోతైన అధ్యయనం జరుగుతోందని, దేనిపైనా రాజీపడకుండా వెళుతున్నందున కొంత సమయం పట్టే అవకాశం ఉందని వివరించారు.

ఆ తరువాత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవకు ఫోన్ చేశారు. ఆనందయ్య మందు ఐసీఎంఆర్ పరిధిలోకి రాదని, ఆయుష్ శాఖకు సంబంధించిన అంశం అని బలరాం భార్గవ ఉపరాష్ట్రపతికి వివరించారు. ఇప్పటికే ఆయుష్ శాఖ అధ్యయనం చేస్తున్నందున, ప్రత్యేకంగా ఐసీఎంఆర్ కూడా అధ్యయనం చేయాల్సినంత ఆవశ్యకత లేదని తెలిపారు. కాగా, ఆనందయ్య మందును తీసుకున్న 500 మందితో జాబితా రూపొందించిన అధికారులు, ఆ జాబితాలో ఉన్నవారికి ఫోన్ చేశారు. అయితే, కొందరు స్పందించకపోగా, మరికొందరు తాము ఆ మందు తీసుకోలేదని చెప్పడంతో అధికారులు తీవ్ర అసంతృప్తికి గురైనట్టు తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా ఆనందయ్య మందు వేసుకున్నామని కొందరు, కరోనా సోకిన తర్వాతే వేసుకున్నామని కొందరు చెబుతున్నట్టు వెల్లడైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles