Telangana Junior Doctors Association calls off strike జూనియర్ డాక్టర్ సమ్మె విరమణ.. డిమాండ్లపై సీఎం సానుకూలం..

Junior doctors association call off strike after kcr promises to fulfill demands

junior doctors strike calls off, junior doctors resume to medical services, junior doctors emergency services, Health officials Junior doctors strike called off, cm kcr health officials meet, junior doctors pandemic, junior doctors legitimate issues, chief minister k chandrashekhar rao, health officials, junior doctors, CM KCR, Strike called off, Telangana

The Telangana Junior Doctors Association called off their day-long strike and reported to their duty after the government addressed their grievances on Thursday. Keeping in view the patient's health as our first priority and also our responsibility to serve them in present pandemic crisis, we T-JUDA are calling off the strike and will be reporting to duties from 9 pm today,” the Doctors' Association said.

జూనియర్ డాక్టర్ సమ్మె విరమణ.. డిమాండ్లపై సీఎం సానుకూలం..

Posted: 05/27/2021 08:02 PM IST
Junior doctors association call off strike after kcr promises to fulfill demands

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న తరుణంలో జూనియర్‌ డాక్టర్లు సమ్మె బాట పట్టి ప్రభుత్వం తక్షణం తమ డిమాండ్లను పరిస్కరించాల్సిందిగా కోరడంతో ప్రభుత్వ కూడా దిగివచ్చి వారి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించింది. దీంతో మెడికల్ సర్వీసులలో తాము రేపటి నుంచి చేరనున్నట్లు తెలంగాణ జూనియర్ వైద్యుల అసోసియేషన్ ప్రకటించింది. వారి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కారం కోరుతూ సమ్మకు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే వారి సమస్యలపై సీఎం కేసీఆర్ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ అధికారులతో చర్చించి పరిష్కరించడంతో వారు సమ్మెను విరమించారు.

స్టయిఫండ్ పెంపును అమలు చేయాలని, పెండింగ్ లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా జూడాలు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే అత్యవసర, ఐసీయూ సేవలు మినహా మిగతా సేవలకు తాము దూరంగా ఉంటామని జూడాలు ప్రకటించారు. మే 28 నాటికి ప్రభుత్వం సామరస్య పూర్వకంగా ముందుకు రాకపోతే అత్యవసర సేవలకు కూడా తాము దూరంగా ఉంటామని హెచ్చరించారు.  అయితే, సమ్మెకు ఇది సమయం కాదని మంత్రి కేటీఆర్ స్పందించారు. జూడాల సమస్యను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు.

ఆరోగ్య శాఖను పర్యవేక్షిస్తున్న సీఎం కేసీఆర్ కూడా అదే రీతిలో పిలుపునిచ్చారు. వెంటనే విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వంతో జూడాల ప్రతినిధుల చర్చలు ఫలప్రదం అయ్యాయి. జూడాల వేతనం 15 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన స్టయిఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి వర్తింపజేయనున్నారు. సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల వేతనం కూడా 80,500 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా సమ్మె విరమిస్తున్నామని జూడాలు వెల్లడించారు. తమ డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేర్చకున్నా, సీఎం సానుకూల స్పందనతో సమ్మె విరమిస్తున్నామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles