Debate over birthplace of Hanuman ends in stalemate హనుమంతుడి జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

Debate over hanumans birth place begins between ttd and kishkindha sansthan

War of words TTD kishkinda Trust, Tirumala Tirupati Devastanam Board Anjanadri, TTD on Hamuman Birth place, Kishkinda Hanumad Janma Bhoomi Tridha Trust, kishkinda trust on Hanuman Birth Place, Govindananda saraswathi Swamy on Hanuman Birth Place

The face-off between Tirumala Tirupati Devasthanams (TTD) and Sri Hanumad Janmabhoomi Teertha Kshetra Trust of Karnataka to resolve the controversy over the birthplace of Hindi god Hanuman ended in a stalemate on Thursday

హనుమంతుడి జన్మస్థలంపై అసంపూర్తిగా ముగిసిన చర్చ

Posted: 05/27/2021 06:19 PM IST
Debate over hanumans birth place begins between ttd and kishkindha sansthan

ఆంజనేయుడి జన్మస్థలం టీటీడీ, కిష్కింద ట్రస్టు మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు సాగి చివరకు చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. నిజానికి హనుమంతుడు ఎక్కడ జన్మించాడన్న వాదనలపై ఈ రెండు అధ్యాత్మిక సంస్థల మధ్య ప్రారంభమైన చర్చ అర్థాంతరంగా, అసంపూర్తిగా ముగిసింది. రెండు అధ్యాత్మిక సంస్థలు ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని వివాదాస్పదం చేసినా.. చివరకు చర్చకు సమ్మతించడంతో ఏదో ఒక విషయం స్పష్టంగా అవిష్కృతం అవుతుందని ఆశించిన హైందవ భక్తజనానికి నిరాశే ఎదురైంది. హనుమంతుడు అంజనాద్రిలోనే జన్మించాడని, కిష్కిందలోనే జన్మించాడని ఇరు ట్రస్టుల మధ్య వివాదం రాజుకున్న విషయం తెలిసిందే.

తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమంటూ గత నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేయడంతో ఈ రెండు ట్రస్టుల మధ్య వివాదం రాజుకుంది. దీంతో హనుమంతుడి జన్మస్థానంపై నెలకొన్న వివాదాన్ని చర్చించేందుకు తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత పీఠంలో హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు, టీటీడీ వర్గాలు సమావేశమైనా.. ఎవరి వాదనలకు వారు కట్టుబడి ఉండడంతో చర్చ అసంపూర్ణంగా ముగిసింది. దీనిపై కిష్కింధ సంస్థాన్ కు చెందిన హనుమద్ జన్మస్థల తీర్థ క్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి స్పందించారు.

హనుమంతుడి జన్మస్థల అంశం ప్రధాన ఇతివృత్తంగా సంస్కృత విద్యాపీఠంలో చర్చించామని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్ర పుణ్యక్షేత్రమని పేర్కొన్నారు. తమకు పంపా క్షేత్ర కిష్కింధ ఒక కన్ను అయితే, తిరుమల మరో కన్ను అని వివరించారు. అయితే, ఇవాళ జరిగిన సమావేశానికి సంబంధించిన అజెండా బుక్ లెట్ లో ఉన్న అంశాలపై ప్రస్తావనే లేదని గోవిందానంద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆంజనేయుడి జన్మ తిథిపై స్పష్టత లేదని అన్నారు. హనుమంతుడి జన్మ తిథి అంటూ మూడు తిథులు ఎలా పెడతారని నిలదీశారు.

ఈ అంశంపై టీటీడీ వాళ్లు ఎప్పుడైనా పంపా ప్రాంతానికి వచ్చారా? అసలు, దీనిపై టీటీడీ కమిటీకి అధికారం ఉందా? కమిటీ ఏర్పాటు చేస్తున్నప్పుడు తిరుమల పెద్దజీయర్ స్వామిని అడిగారా? ఆ కమిటీలో పెద్దజీయర్ స్వామి ఎందుకు లేరు? రామానుజ సంప్రదాయం ప్రకారం ఆంజనేయస్వామి వారికి వివాహం చేస్తారా? ఎన్నో కల్పాలు, మన్వంతరాలు గడిచాక ఈ చర్చ ఏంటి?  అంటూ గోవిందానంద టీటీడీకి ప్రశ్నల వర్షం కురిపించారు. రామాయణం ప్రకారం కిష్కింధనే మారుతి జన్మస్థలం అని ఉద్ఘాటించారు. హనుమంతుడి జన్మస్థలం నిర్ధారణకు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీకి ప్రామాణికత లేదని అన్నారు.

అయినా, ధార్మిక విషయాలను నిర్ణయించాల్సింది ఎవరు? అని గట్టిగా అడిగారు. శృంగేరి శంకరాచార్యులు, కంచి కామకోఠి పీఠాధిపతులు, మధ్వాచార్యులు, తిరుమల పెద్దజీయర్, చినజీయర్ స్వాముల సమక్షంలో చర్చించాల్సిన అంశాలివి అని స్పష్టం చేశారు. సామాన్య భక్త జనాలను గందరగోళంలోకి నెట్టేలా టీటీడీ వాదనలు ఉన్నాయని గోవిందానంద విమర్శించారు. టీటీడీ తీసుకువచ్చిన బుక్ లెట్ పై తాము జీయర్ స్వాముల వద్దకు వెళతామని వెల్లడించారు. ధర్మం గురించి తేల్చాల్సింది ధర్మాచార్యులేనని ఆయన అభిప్రాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles