New Toll Plaza Guidelines: Toll Tax Exemption వాహనదారులకు గుడ్ న్యూస్: గీత ధాటితే టోల్ ఫీజు లేదు..

No need to pay toll if wait time exceeds 10 seconds rule explained

Toll Plazas, toll tax, Fastag, NHAI, toll tax exemption, Electronic Toll Collection, Ministry of Road Transport and Highways, National Highways, Four Wheelers

A document from the Ministry of Road Transport and Highways says that road users in a four-wheeler need not pay toll if they have been waiting at the toll plaza for more than 10 seconds. At the same time, If there are vehicles behind the yellow line, then the toll operator will have to let the cars ahead go without paying the tax.

వాహనదారులకు గుడ్ న్యూస్: గీత ధాటితే టోల్ ఫీజు లేదు..

Posted: 05/27/2021 10:57 AM IST
No need to pay toll if wait time exceeds 10 seconds rule explained

దేశవ్యాప్తంగా ఫాస్ట్ ట్యాగ్ ను తప్పనిసరి చేసిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అదే సమయంలో వాహనదారులకు కూడా మినహాయింపులు కల్పించింది. నిజానికి చెప్పాలంటే దేశవ్యాప్తంగా నూతన రోడ్డు రవాణ చట్టాన్ని తీసుకువస్తూ.. పలు సవరణలు చేసిన కేంద్రం.. అదే సమయంలో పలు మినహాయింపులను తీసుకువచ్చింది. దీంతో 2018లోనే టోల్ గేట్ నిర్వాహకులతో వాహనదారులు కూడా వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే అప్పట్లో పలు పత్రికల్లో ఓ వార్త సంచలనంగా మారింది. అదేంటంటే టోల్ గేట్ల వద్ద వాహనాలు పసుపు వర్ణం గీతను దాటితే టోల్ టాక్స్ తీసుకోకూడదన్న నిబంధన పోందపర్చి ఉండటమే అందుకు కారణం.

అయితే ఈ వార్త వచ్చిన విషయం కొందరు వాహనదారులకు మాత్రమే తెలుసు. ఇక పలు వాహనాదారులతో పాటు టోల్ ప్లాజాలలోని ఉధ్యోగులకు కూడా ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. దీంతో తెలిసిన వారు నిర్వాహకులతో వాగ్వాదానికి కూడా దిగారు. అయితే తమకు అలా అని ఎలాంటి సూచనలు రాలేదని చెప్పడంతో పాటు బిక్కముఖం వేయడం అక్కడి ఉద్యోగుల వంతు అయ్యింది. అయితే తాజాగా కేంద్ర రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఈ మేరకు కొత్తగా ప్రకటన విడుదల చేసింది. దీంతో వాహనదారులకు తాము ఎదురుచూస్తున్న శుభవార్త అందింది.

ప్రతి టోల్ బూత్ వద్ద 100 మీటర్ల దూరంలో పసుపు గీతలు గీయాలని నిర్ణయించింది. టోల్ చెల్లించే సమయంలో వాహనాల బారు ఆ గీతను దాటితే ఇక టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు క్యూలో ఉన్న వాహనాలన్నింటినీ రుసుము వసూలు చేయకుండానే వదిలేయాల్సి ఉంటుంది. ఇక దీంతో పాటు ఏదేని వాహనానికి పది సెకన్ల కన్నా ఎక్కువ సమయం వేచి వుండాల్సి వస్తే ఆ వాహనాలకు కూడా టోల్ పన్ను మినహాయించాల్సిందేనని  జాతీయ రహదారుల సంస్థ నిర్ణయించింది. వాహనదారుల కష్టాలు తీర్చే ఉద్దేశంతోనే ఎన్‌హెచ్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది. టోల్‌ప్లాజాల వద్ద నిరీక్షణ సమయాన్ని కుదించేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles