Deep depression intensifies into cyclonic storm పెను తుఫానుగా మారుతున్న ‘యాస్’.. 90 రైళ్ల రద్దు

Cyclone yaas cyclone to turn severe in 24 hrs 90 trains cancelled

cyclone yaas, cyclone yaas news, cyclone yaas update, India Meteorological Department (IMD), Bay of Bengal, cyclone yaas update today, cyclone yaas track, cyclone yaas tracker, cyclone yaas in west bengal, cyclone yaas in odisha, East Coast Railway, IMD, East Coast Railway, Paradip, Balasore, Digha, Odisha, West Bengal

A deep depression over the Bay of Bengal has intensified into a cyclonic storm 'Yaas' and is likely to turn "very severe" as it crosses Odisha and West Bengal coasts on May 26. A total of 90 trains to Odisha and West Bengal have been cancelled in view of the fast approaching storm.

పెను తుఫానుగా మారుతున్న ‘యాస్’.. బెంగాల్, ఒడిశాలకు వెళ్లే రైళ్ల రద్దు

Posted: 05/24/2021 10:35 AM IST
Cyclone yaas cyclone to turn severe in 24 hrs 90 trains cancelled

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 24 గంటల వ్యవధిలో వాయుగుండం మారి.. ఇవాళ తుపానుగా, రేపు అతి తీవ్ర తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం ఇది పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉత్తరవాయవ్య దిశగా కదులుతోంది. ఇదే సమయంలో ఒడిశాలోని బాలసోర్ కు ఆగ్నేయంగా 650 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ బెంగాల్ డిఘాకు అగ్నేయంగా 630 కిలోమీటర్ల దూరంలో కేంధ్రీకృతమై వుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుపానుగా మారనున్న ‘యాస్’ ఈ నెల 26న సాయంత్రం ఒడిశాలోని పారాదీప్, ధర్మల మధ్య తీరాన్ని తాకే అవకాశముందని ఆ తరువాత కూడా ఇది ఉత్తర, ఉత్తర, వాయువ్యాల దిశగా కదులుతూ పశ్చిమ బెంగాల్ లోని సాగర్ ద్వీపం వద్ద మరోమారు తీరం దాటే అవకాశం ఉందని ఐడీఎం అధికారులు పేర్కొన్నారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 150 నుంచి 170 కిలోమీటర్ల వాయువేగంతో గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు, ఇక తీరాన్ని తాకిన నేపథ్యంలో పారాదీఫ్, దర్మల మధ్య గాలులు ఏకంగా గంటలకు 180 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని అధికారులు తెలిపారు.

‘యాస్’ కారణంగా అండమాన్ నికోబార్ దీవుల్లో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే రేపటి నుంచి 27వ తేదీ వరకు ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. యాస్ ధాటికి కేంద్రపాడ, జగత్ సింగ్ పూర్, బాలసోర్, భద్రక్ జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చాటుతుందని వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. ఒఢిశాలోని పూరి, కటక్, జాజ్ పూర్; యమూర్ భంజ్ లలోనూ యాస్ తన ప్రభావాన్ని చాటుతుందని, ఇక్కడ 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. వీటితో పాటు పశ్చిమ బెంగాల్ లోని తీరప్రాంత జిల్లాలైన పూర్బ, పశ్చిమ మిడ్నాపూర్, ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలో, హౌరా, హూగ్లీలు  మోస్తారు నుంచి భారీ, అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

మత్స్యకారులు ఎవరూ చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. యస్ తుఫాను రేపు పెను తుపానుగా మారే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. శనివారం 59 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ నిన్న మరిన్ని రైళ్లను.. మొత్తంగా ఇవాళ్టికి 90 రైళ్లను రద్దు చేశామని, ఇక సాయంత్రం తుఫాను మరింత ఉదృతమైన నేపధ్యంలో మరో పది రైళ్లను కూడా రద్దు చేయనున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి 30వ తేదీ మధ్య రైళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. వీటిలో నిజాముద్దీన్, హౌరా, సంత్రగచ్చి, తిరువనంతపురం, చెన్నై సెంట్రల్, వాస్కోడిగామా, పాట్నా, పురులియా, కన్యాకుమారి, తాంబ్రం, యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే రైళ్లు ఉన్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒక్కో రైలును ఒక్కో రోజు నిలిపివేస్తున్నట్టు రైల్వే తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cyclone yaas  IMD  East Coast Railway  Paradip  Balasore  Sagar Island  Digha  Odisha  West Bengal  

Other Articles