"One Nation, All Humiliation": Mamata Banerjee ప్రధాని సమావేశంలో ముఖ్యమంత్రులకు అవమానం: మమత

Mamata banerjee furious for not being allowed to speak in pm s meeting

Mamata Banerjee, Narendra Modi, Mamata Banerjee News, Mamata Banerjee News Today, Mamata Banerjee on Meeting with PM Modi, Bengal CM Mamata Banerjee, Mamata Banerjee ruckus, Mamata Banerjee, PM Modi Mamata Banerjee, Mamata Banerjee vs Modi, west bengal, POlitics

A political ruckus broke out yet again amidst the Centre and West Bengal government after Chief Minister Mamata Banerjee said she was not allowed to speak at the Prime Minister’s meeting with District Magistrates (DMs) on the issue of COVID

ప్రధాని సమావేశంలో బీజేపియేతర ముఖ్యమంత్రులకు అవమానం: మమత

Posted: 05/20/2021 07:44 PM IST
Mamata banerjee furious for not being allowed to speak in pm s meeting

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఫైర్ అయ్యారు. ప్ర‌ధానితో కొవిడ్-19పై జ‌రిగే స‌మావేశాల్లో ముఖ్య‌మంత్రుల‌ను క‌నీసం మాట్లాడేందుకూ అనుమ‌తించ‌డం లేద‌ని ఆరోపించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీల్లో ముఖ్య‌మంత్రుల‌ను అన్నింటికీ త‌ల‌లూపే తోలుబొమ్మ‌ల స్థాయికి దిగ‌జార్చార‌ని మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. ప్రధానితో జరిగిన సమావేశంలో..తనను మాట్లాడటానికి అనుమతించకపోవడాన్ని అవమానంగా భావించానని చెప్పారు. కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప‌ది రాష్ట్రాల అధికారులు, సీఎంల‌తో గురువారం ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిర్వ‌హించిన‌ స‌మావేశంలో పాల్గొన్న అనంత‌రం దీదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

ఈ సమావేశంలో ప్రధాని, కొందరు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తప్ప వేరే రాష్ట్రాల సీఎంలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని మమత ఆరోపించారు. ప్రధాని నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రధాని మోడీకి అభద్రతా భావం ఎక్కువని, అందుకే తమ మాటలను ఆయన వినట్లేదని మండిపడ్డారు. సీఎంల‌ను మాట్లాడేందుకు అనుమ‌తించ‌క‌పోతే ఇక‌ వారిని ఎందుకు పిలిచార‌ని మమత ప్ర‌శ్నించారు. సీఎంల‌తో ప్ర‌ధాని స‌మావేశం దారుణంగా విఫల‌మైంద‌ని ఇది సీఎంల‌ను అవ‌మానించేలా ఉంద‌ని ఆమె పేర్కొన్నారు. ప్ర‌ధానితో భేటీల్లో మాట్లాడేందుకు అనుమ‌తించ‌క‌పోవడంపై అన్ని రాష్ట్రాల సీఎంలు నిర‌స‌న తెల‌పాల‌ని దీదీ పిలుపు ఇచ్చారు.

సమావేశంలో భాగంగా వ్యాక్సిన్ల గురించిగానీ, రెమ్ డెసివిర్ మందులపైగానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదని ఆమె మండిపడ్డారు. పెరిగిపోతున్న బ్లాక్ ఫంగస్ కేసుల గురించీ వివరాలు అడగలేదన్నారు. దేశంలో క‌రోనా కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింద‌ని ఈ స‌మావేశంలో ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌ను ప్ర‌స్తావిస్తూ అలాగైతే దేశ‌వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి ప్ర‌జ‌లు ఎందుకు మ‌ర‌ణిస్తున్నార‌ని దీదీ నిల‌దీశారు. తాను కరోనా టీకాల కొరత గురించి నిలదీద్దామని అనుకున్నా నోరెత్తనివ్వలేదని మమత ఆరోపించారు. దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గుతున్నాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కూడా మమత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇలాగే కేసులు తగ్గాయన్నారని, కానీ, ఆ తర్వాత కేసులు విపరీతంగా పెరిగాయని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles