Pillion rider rams into check-post gate, dies in Telangana మిత్రుడి ప్రాణాన్ని బలితీసుకున్న వాహనదారుడి నిర్లక్ష్యం..

Cctv footage pillion rider rams into check post gate dies in telangana

Lockdown violations, Pillion rider, forest check post, Tapalpur, Jannaram mandal, Mancherial, cctv footage, forest official, Telangana, crime

In a horrifying incident, a pillion rider died on the spot after hitting the check-post barrier at Tapalpur village of Jannaram mandal in Mancherial district. According to CCTV footage, a forest official saw a bike coming towards check-post from Luxettipet and shouted at them to stop their two-wheeler. Fearing arrest for breaking the lockdown rules, the biker increasing the speed to zoom past the check-post.

ITEMVIDEOS: మిత్రుడి ప్రాణాన్ని బలితీసుకున్న వాహనదారుడి నిర్లక్ష్యం..

Posted: 05/24/2021 11:30 AM IST
Cctv footage pillion rider rams into check post gate dies in telangana

తెలంగాణలో ప్రభుత్వం సహా పోలీసు ఉన్నతాధికారుల నుంచి అదేశాలు లభించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు నిబంధనలను ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడిన వారి వాహనాలను స్వాదీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు. మరికోన్ని చోట్ల జరిమానాలు విధిస్తున్నారు. అయితే తాజాగా వచ్చిన అదేశాల నేపథ్యంలో వాహనదారులను అదుపులోకి తీసుకుని కొన్న గంటల తరువాత వారిని వదిలిపెడుతున్నారు. ఈ క్రమంలో లాక్ డౌన్ ఉల్లంఘనలకు పాల్పడిన ఓ వాహనదారుడు పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తనతో పాటు తన వాహనంపై నున్న తన సహచరుడి ప్రాణాలను బలిగొన్నాడు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ ప్రమాదం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

జిల్లాలోని జన్నారం మండలం తపాలపూర్ వద్ద జరిగిన ఈ ఘటనలో సహచరుడు కింద పడిపోయిన తరువాత కనీసం వాహనాన్ని నిలిపి అతడికి ఏమైందోనని కూడా వెనక్కి చూడకుండా వెళ్లిపోవడం వాహనదారుడిపై విమర్శలకు తావిస్తోంది. ఈ సంఘటన పూర్వపరాల్లోకి వెళ్తే జిల్లాలోని లక్సెట్టిపేట వైపు నుంచి తపాల్ పూర్ వైపుకు వెళ్లేందుకు ఓ ద్విచక్ర వాహనంపై ఇద్దరు స్నేహితులు వస్తున్నారు, అయితే లాక్ డౌన్ నేపథ్యంలో అదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ అధికారులు వాహనాలు వెళ్లకుండా తమ అటవీశాఖ తనిఖీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టు వద్ద అడ్డంగా గేటు వేశారు. అయితే లాక్ డౌన్ నేపథ్యంలో చెక్ పోస్టు వద్ద పోలీసులను చూసిన యువకులు భయపడ్డారు,

ఇక వీరి నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ స్పీడు పెంచారు. అదే సమయంలో వారిని గమనించిన ఓ అటవీ శాఖ సిబ్బంది వారిని వాహనం నిలపాల్సిందిగా కోరుతూ.. వేగంగా వస్తున్న వారికి సైగా చేశారు. దీంతో మరింత కంగారుకు, అందోళనకు గురైన వాహనదారుడు మరింత స్పీడును పెంచాడు. అటవీ శాఖ సిబ్బందికి దిరికితే తమను పట్టుకుని అరెస్టు  చేస్తారనో, లేక వాహనాన్ని జప్తు చేస్తారనో భయంతో వారికి చిక్కకుండా తప్పించుకోవాలని శరవేగంగా దూసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు, అంతే వాయువేగంతో వచ్చిన బైక్ గేటు వద్దకు రాగానే బైక్ నడిపై వ్యక్తి తన తలను కిందకు వంచాడు, అయితే ఇది గమనించని బైక్ వెనకాల కూర్చున్న వ్యక్తికి గేటు బలంగా ఢీకొన్నింది.

అయితే ఏదో జరుగరానిదే జరుగుతుందని కీడు శంకించిన అటవీశాఖ సిబ్బంది చెక్ పోస్టు గేటును పైకి లేపే ప్రయత్నం చేసినా అది కూడా వృధా ప్రయాసగానే మారిపోయింది. అప్పటికే ఆలస్యం జరిగింది. బైక్ ను వేగంగా గేటు కిందినుంచి పోనివ్వడంతో తాను తల వంచి తప్పించుకున్నా.. తన వెనుకనున్న మిత్రుడు గురించి పట్టించుకోలేదు. దీంతో అతడి మెడకు గేటు బలంగా తాకడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. అయినప్పటికీ పట్టించుకోని బైకర్ అదే వేగంతో దూసుకెళ్లాడు. ఈ మొత్తం ఘటన చెక్‌పోస్టు వద్దనున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వైరల్ అయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles