AP spent Rs.2,229 Cr. to check Covid pandemic: AP CM ప్రజలందరికీ వాక్సీనేషన్ ఉచితంగా ఇస్తాం: అసెంబ్లీలో సీఎం జగన్

Ap govt has spent rs 2 229 crore on covid 19 pandemic cm jagan reddy

Budget, AP Assembly, covid-19, Jagan Mohan Reddy, Covid Care Centres, oxygen, Remdisevir, covid vaccination, covaxin, covisheild, YS Jagan, AP CM, Budget session, andhra pradesh, politics

In the second wave alone over 47,000 beds have been made available for covid patients in 649 dedicated covid hospitals across the State. Andhra Pradesh government has spent ₹2,229 crore on tackling the Covid-19 pandemic in the last 14 months, according to Chief Minister YS Jagan Mohan Reddy.

ప్రజలందరికీ వాక్సీనేషన్ ఉచితంగా ఇస్తాం: అసెంబ్లీలో సీఎం జగన్

Posted: 05/20/2021 06:45 PM IST
Ap govt has spent rs 2 229 crore on covid 19 pandemic cm jagan reddy

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉచితంగానే వాక్సీన్ అందిస్తామని ఉద్ఘాటించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. వ్యాక్సినేషన్ పై అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే సుమారు 7కోట్ల డోసులు కావాలని అన్నారు. వాటిని ఎలాగైనా, ఎక్కడినుంచైనా తీసుకువచ్చి ప్రజలందరికి ఉచితంగా వేస్తామన్నారు. వాక్సీనేషన్ ప్రక్రియలో తొలుత ప్రధాన్యత 45ఏళ్లు దాటిన వారికే అన్నారు. ఆ తరువాత విడతలో 18 ఏళ్లు నిండిన వారికి ప్రాధాన్యత కల్పించి వాక్సీన్లు కేటాయిస్తామన్నారు.

వాక్సీన్ల ప్రక్రియ మొత్తం పూర్తిగా కేంద్రం అదేశాల మేరకు జరుగుతుందని, కేంద్రం నుంచి వచ్చిన టీకాలనే ఇక్కడి ప్రజలకు వారి అదేశానుసారం ఇవ్వడమే తాము చేస్తున్న కార్యమని.. అయితే వీటిపై నిజాలు తెలిసినా కొందరు రాజకీయం చేస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. గ్లోబల్ టెండర్లు పిలిచిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని సీఎం జగన్ తెలిపారు. అయితే కరోనా నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నా కొన్ని చోట్ల మరణాలు సంభవిస్తుండటంపై దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. వాటిని నివారించడానికి తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని అన్నారు.

తల్లిదండ్రులను కోల్పోయిన బిడ్డలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కుటుంబంలో ఒకరికి కరోనా వస్తే మిగతా అందరికి వస్తోంది. కొన్ని సందర్భాల్లో కోవిడ్ తో తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతున్నారు. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. అలాంటి ఘటనలు నా మనసుకు చాలా కష్టం అనిపించాయి. అటువంటి పిల్లల కోసం(తల్లి, తండ్రిని కోల్పోయిన) రూ.10లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. దాని మీద వచ్చే వడ్డీ పిల్లలకు నెల నెల అందేలా చేస్తే దాంతో పిల్లలు బతికేస్తారు. ఆ తర్వాత 25ఏళ్ల వయసు వచ్చాక వారికి ఏదో ఒక విధంగా ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఆ స్కీమ్ ని ఫైనలైజ్ చేశామని చెప్పారు.

కోవిడ్ సమయంలో ప్రపంచం మొత్తం మనల్ని చూస్తోంది. ఏ విధంగా మనం ఒకరినొకరం సపోర్ట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నామో చూస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర అధికార యంత్రాంగం, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా.. పరిరకించాల్సిన బాధ్యత అందరిపై వుందని, ఇక మహమ్మారి వచ్చినా దానిని ధృడంగా ఎదుర్కోవచ్చునని ప్రజల మనోధైర్యాన్ని నింపేలా రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలకు, మీడియా వ్యవహరించాలని కోరుతున్నానని అన్నారు. అంతేకాని ప్రజలకు కుంగుబాటుకు గురయ్యేలా వార్తలను రాయడం , అసత్య వార్తలు కానీ, అర్థ సత్యాలకు కానీ, అపోహలు కానీ ఇలాంటివి ప్రసారం చేసి, ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసి నిలబడే ప్రాణాన్ని కూడా ఆడే గుండెను కూడా ఆపేయకండి అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా” అని సీఎం జగన్ అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : covid vaccination  covaxin  covisheild  YS Jagan  AP CM  Budget session  andhra pradesh  politics  

Other Articles