Centre orders AP to vaccinate all above 18 yrs వాళ్లందరికీ కరోనా టీకా వేయాల్సిందే: కేంద్రం స్పష్టీకరణ

Union government says no to andhra govt request on corona vaccine

coronavirus, vaccination, Remidisiver, Oxygen, Anil kumar singhal, CM YS Jagan, Union Government, Union Health Ministry, PM Modi, Andhra Pradesh

Union Health ministry suggests officials to use the prescibed quota given to 18-45 yrs category to be used to the same age group. On a request to use the quota for 45 to 60 yrs who are widely effected with coronavirus was turned down by centre and suggested to vaccinate priority groups in 18 to 45 years.

ఏపీ అభ్యర్థనకు కేంద్రం నో: వాళ్లందరికీ కరోనా టీకా వేయాల్సిందే.!

Posted: 05/07/2021 10:19 PM IST
Union government says no to andhra govt request on corona vaccine

కరోనా వైరస్ ఓ వైపు విజృంభిస్తున్నా.. యువత మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇక ఇదే సమయంలో 45 ఏళ్లు పైబడిన వారిలో కరోనా మహమ్మారి అధిక ప్రభావాన్ని చూపుతోంది. ఈ విషయం తెలిసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగా అధిక ప్రభావం చూపుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వాక్సీన్ కేటాయించేందుకు కేంద్రప్రభుత్వాన్ని అనుమతి కోరింది. 18 ఏళ్లు పైబడినవారి కోసం కేటాయించిన టీకాలను వారికే ఇవ్వాలని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది. ఈ నెల 1 నుంచి 18 ఏళ్లు నిండిన యువతీయువకులకు వాక్సీన్ ఇవ్వాలని కేంద్రం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది.

దీంతో పాటు 18 ఏళ్లు నిండిన యువత కోసం ప్రత్యేకంగా 13 లక్షల వాక్సీన్లను కేటాయించింది. ఇలా చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని ఏపీ ప్రభుత్వం భావించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. కాగా, అందుకు కేంద్రం నిరాకరించింది. తాము కేటాయించిన వారికే వ్యాక్సీన్లు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఇప్పుడు కేటాయించిన వ్యాక్సిన్లు కాకుండా మరో 3.5 లక్షల వ్యాక్సిన్లు ఇస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని తెలిపారు. ఇందుకోసం అడ్వాన్సు కింద అవసరమైన నిధులను విడుదల చేసినట్టు చెప్పారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా చికిత్సకు అవసరమైయ్యే ఔషధాలు, ఆక్సిజన్ కోటాను పెంచాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారని సింఘాల్ తెలిపారు. ఇక రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అవసరానికి తగ్గట్టుగా రెమిడెసివిర్ ఇంజక్షన్ల కేటాయింపులు కూడా పెంచాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరారని సింఘాల్ తెలిపారు. ప్రస్తుతం రెమిడిసివిర్ ఇంజక్షన్ల కొరత వుందని అన్నారు. మూడో వేవ్ వచ్చినా ఆక్సిజన్ కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆసుపత్రులలో ‘పీఎస్ఏ’ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని సింఘాల్ వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : coronavirus  vaccination  Remidisiver  CM YS Jagan  Union Government  

Other Articles